
అయితే, సూపర్ స్టార్ ఏ ప్రాంతానికి, ఏ ఘాట్ కు రానున్నారో తెలుసా? భక్తుల రద్దీ అధికంగా ఉంటూ, వీఐపీలు వెల్లువలా వచ్చే విజయవాడకో లేదా శ్రీశైలానికో కాదు. పెద్దగా పేరు లేని గుంటూరు జిల్లా అచ్చంపేట వద్దకు. ఈ జిల్లాలోని అచ్చంపేట మండలంలోని చింతపల్లిలో చాలామందికి తెలియని ఓ దివ్యక్షేత్రం కొలువు తీరి ఉంది. అదే విష్ణు పంచాయతన దివ్య మహా పుణ్య క్షేత్రం.
సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ క్షేత్రానికే విచ్చేయనున్నారు. ఈ మేరకు ఆలయ కమిటీకి సూపర్ స్టార్ రాకకు సంబంధించిన వర్తమానం కూడా అందింది. రజనీ రాకతో ఈ క్షేత్రానికి మరింత పేరు వస్తుందని ఆశిస్తున్నట్టుగా ఆలయ అధికారులు తెలిపారు. ఒక్క పేరే కాదు, రజనీ వచ్చి వెళ్ళిన నాటి నుండి ఆ ఘాట్ కు భక్తుల రాక కూడా క్రమక్రమంగా పెరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు.
The motion poster of Chandrayan has been unveiled, giving audiences a glimpse into a wildly…
Chennai Super Kings have been asked to consider a change in captaincy before IPL 2027,…