
స్టార్ హీరోల చిత్రాలు లీక్ అయితే, వసూళ్లు ఎంత వరకూ తగ్గుతాయో తాను చెప్పలేనని, చిన్న సినిమాలు అయితే మాత్రం భారీగా నష్టపోతాయని భావిస్తున్నానని అన్నారు. కాగా, ఇటీవల పలు కొత్త చిత్రాలు విడుదలకు ముందుగానే ఆన్ లైన్లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్ తాజా చిత్రం ‘సుల్తాన్,’ దానికన్నా ముందు ‘ఉడ్తా పంజాబ్,’ ఆపై ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’ చిత్రాలు నెట్టింట ప్రత్యక్షమైన విషయం తెలిసిందే.
ఇక, ‘కబాలి’ సినిమా ఆన్‌లైన్ పైరసీని అడ్డుకునేలా చూడాలంటూ నిర్మాత మద్రాసు హైకోర్టుకెక్కడంతో 169 కి పైగా వెబ్ సైట్లపై కోర్టు ఇప్పటికే ఆంక్షలు విధించగా, డార్క్ వెబ్ లింకులను డిలిట్ చేయాలని ‘కబాలి’ ప్రొడక్షన్ హౌస్ వర్గాలు అధికారులను కోరినట్టు తెలిసింది. ఈ మూవీని డౌన్‌లోడ్ చేసుకునేందుకు డార్క్ వెబ్ పై ఈ సినిమా తాలూకు లింకులు ఎన్నో అందుబాటులోకి వచ్చాయని హిందూస్తాన్ టైమ్స్ పేర్కొంది. కానీ దీన్ని వాడాలంటే నిర్దిష్టమైన కాన్ఫిగరేషన్స్ అవసరమవుతాయని సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్న టాక్.
The NDA government that is currently in power in Andhra Pradesh is doing a solid…
వినియోగదారుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకుంది. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది.…