సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు ఒక పెద్ద పండుగ లాంటి సినిమా కాబోతుందన్న సంకేతాలను ఇప్పటికే ‘కబాలి’ టీజర్ ఇచ్చేసింది. అయితే తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసిన మరో పాట టీజర్, ఈ విషయాన్ని మరింత బలపరిచింది. ప్రస్తుతం ఈ ‘కబాలి’ టీజరే సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది.
‘భయమా అంటూ రజనీ నవ్వుతో మొదలైన 35 సెకన్ల టీజర్ అదే రజనీ స్టైల్ గా కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం’తో ముగుస్తుంది. చిన్న టీజరే అయినా రచ్చ మాత్రం ఓ భారీ స్థాయిలో చేస్తోంది. బ్యాక్ గ్రౌండ్ లో వస్తున్న పాట ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించే విధంగా ఉండడంతో… అభిమానుల ఉత్సాహానికి అవధులు లేకుండా పోతున్నాయి. చూడబోతుంటే… ఇండియన్ బాక్సాఫీస్ ను తన ‘కబాలి’తో కేక పెట్టించడం ఖాయంగా కనపడుతోంది.
ADVERTISEMENT
ADVERTISEMENT



