
తమ కుటుంబానికి మద్దతుగా నిలుస్తున్న సోదరి ఐశ్వర్య భర్త ధనుష్ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. గ్రాఫిక్స్ టెక్నాలజీలో నిపుణురాలైన సౌందర్య 2010లో వ్యాపారవేత్త అశ్విన్ రామ్‌కుమార్ ను వివాహం చేసుకోగా, వీరికి ఓ బాబు కూడా ఉన్నాడు. తండ్రి రజనీకాంత్ నటించిన యానిమేషన్ చిత్రం ‘కొచ్చాడియన్’తో దర్శకురాలిగా తన ప్రతిభను నిరూపించుకునే ప్రయత్నం చేసారు.
అలాగే ‘గోవా’ చిత్రం ద్వారా నిర్మాతగానూ మారిన సౌందర్య, ధనుష్ హీరోగా ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇటీవల కాలంలో సినీ ప్రముఖుల విడాకుల వార్తలు ఎక్కువగా హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ కోవలోకి సౌందర్య కూడా చేరడంతో విస్తృత ప్రచారం జరిగింది. మీడియాలో ఆమె విడాకుల వార్తలు ప్రముఖంగా వస్తుండడంతో సౌందర్య స్పందించక తప్పలేదు.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…