Telugu

హీరోయిన్ల మీద దాసరి దెబ్బ బాగా పనిచేసినట్టుందే!

తెలుగు సినిమాలకు ప్రస్తుత హీరోయిన్లు ఇస్తున్న ప్రాధాన్యత గురించి దర్శకరత్న దాసరి నారాయణరావు పలు సందర్భాలలో తన ఆవేదనను వెలిబుచ్చారు. ఒక్క రిబ్బన్ కటింగ్ కోసం కోట్లు తీసుకుంటున్న హీరోయిన్లు, తెలుగు సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడం లేదని, సినీ వేడుకలలో భాగస్వామ్యులు కావడం లేదని, తెలుగు సినిమాలలో నటిస్తూ కోట్లు వేనుకేసుకుంటున్న వీరంతా ఒక్క ముక్క తెలుగు భాషను నేర్చుకోవడం లేదని… తీవ్రస్థాయిలో మండిపడిన సందర్భాలున్నాయి.

అయితే దర్శకరత్న వ్యాఖ్యలతో ఏకీభవించేవారున్నారు, అలాగే విభేదించేవారున్నారు. కానీ, ఈ వ్యాఖ్యల ప్రభావం ప్రస్తుత టాలీవుడ్ టాప్ హీరోయిన్లపై పెను ప్రభావమే చూపినట్లుగా కనపడుతోంది. దాసరి వ్యాఖ్యలకు ముందే సమంత తెలుగు మొత్తం అనర్గళంగా మాట్లాడుతుండగా, ఆ తర్వాత తమన్నా వంటి వారు కూడా అప్పుడప్పుడు తెలుగులో తమ పరిజ్ఞానాన్ని కూడా పరీక్షించుకున్నారు. తాజాగా మరో ముద్దుగుమ్మ, ప్రస్తుత టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వంతు వచ్చినట్లుంది.

ADVERTISEMENT

“ధృవ” ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న రకుల్, మొత్తం తెలుగు భాషలోనే ప్రస్తావించడం యాంకర్ సుమనే ఆశ్చర్యానికి గురి చేసింది. అది కూడా ఏదో రెండు ముక్కలు తెలుగులో మాట్లాడి, మిగతావన్నీ ఇంగ్లీష్ లో మాట్లాడడం కాకుండా, దాదాపు మూడు నిముషాలకుపైనే “ధృవ” సినిమా గురించి, అందులో నటించిన నటుల గురించి రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతుంటే చప్పట్లు కొట్టడం ప్రేక్షకుల వంతయ్యింది. రకుల్ ఎంతో ప్రొఫెషనల్ గా ఉంటుందని, సినిమా కోసం ఎంతో కష్టపడుతుందని చెప్పిన వారందరి మాటలు నిజమనిపించే విధంగా రకుల్ తెలుగు భాషతో అందరినీ కట్టిపడేసింది. బహుశా దాసరి గారు చూసినా పడిపోతారేమో..! అనేటంతగా ఆకట్టుకుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

IND T20 Captaincy Twist: BCCI in Total Confusion?

India’s T20 captaincy discussion has once again become a major talking point, with selectors yet…

2 minutes ago

Can Akshay Kumar Survive Clash with SRK and Avengers?

The official release date of Akshay Kumar and Anees Bazmee film, Ram Aur Shyam has…

21 minutes ago