‘ధృవ’ ఆన్ సెట్స్ – రామ్ చరణ్ ‘ఫ్రెష్’ ఫోటోస్!

ram-charan-dhruva-stillతన కొత్త సినిమా కోసం రామ్ చరణ్ పూర్తిగా మేకోవర్ అయినట్లు ఇటీవల ‘ధృవ’ సినిమా సెట్స్ లో దిగిన ఓ ఫోటో స్పష్టం చేసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరికొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ముందుగా లీకైన ఫోటో మెగా అభిమానులకు సంతృప్తిని ఇవ్వగా, తాజాగా సందడి చేస్తున్న ఫోటోలు కూడా ఫ్యాన్స్ ను మెప్పించే విధంగానే ఉన్నాయి.

పూర్తి మీసకట్టు, ఫుల్ షేవింగ్, పైకి లేపిన హెయిర్ స్టైల్ తో కనపడుతున్న చెర్రీ, ఇప్పటివరకు కనపడిన సినిమాలలో కంటే, ‘ధృవ’లో ‘బెస్ట్’ లుక్ లో ఉన్నాడన్నది ఫ్యాన్స్ మాట. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో మళ్ళీ చెర్రీ విజయాల బాట పడతారని అభిమానులు కూడా ఎన్నో ఆశలను పెట్టుకున్నారు. ‘రేసుగుర్రం’ ద్వారా బన్నీ కెరీర్ ను సక్సెస్ బాట ఎక్కించిన సురేందర్, చెర్రీని కూడా అలాగే గట్టేక్కిస్తారన్నది అభిమానుల ఆకాంక్ష.

ADVERTISEMENT

ram-charan-dhruva-still

ADVERTISEMENT
Latest Stories