అలా అయితే అసలు శంకర్ తో సినిమా వద్దు అంటున్న మెగా ఫ్యాన్స్

Ram Charan - Director Shankarఇటీవలే సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాని ప్రకటించారు దిల్ రాజు. ఆర్ఆర్ఆర్ తరువాత రామ్ చరణ్ చెయ్యబోయే సినిమా ఇదే. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త మెగా ఫ్యాన్స్ ను కలవరపెడుతుంది. ఈ సినిమాకు రామ్ చరణ్ కాకుండా మరో ప్రముఖ తమిళ హీరో కూడా ఉంటాడట.

అటువంటి సినిమా మీద మెగా ఫ్యాన్స్ కు అసలు ఇంటరెస్ట్ లేదు. తమిళ స్టార్ హీరో అయితే తమిళ మీడియా పూర్తిగా ఆ సినిమాకు తమిళ సినిమా అని ప్రచారం మొదలుపెడుతుంది. రామ్ చరణ్ ని ఏదో గెస్ట్ రోల్ అన్నట్టు చేసేస్తుంది. శంకర్ సినిమా అంటే రెండు మూడు సంవత్సరాలు లాక్ అయిపోతాడు చరణ్.

ADVERTISEMENT

పైగా అటువంటి మల్టీస్టారర్ సినిమా అంటే వేస్ట్ అని మెగా ఫ్యాన్స్ భావన. మరికొందరు మెగా ఫ్యాన్స్ శంకర్ హవా అయిపోయింది. ఈ సమయంలో శంకర్ తో సినిమా అంటే అనవసరమే అని అంటున్నారు. శంకర్ ఆ సినిమా స్క్రిప్ట్ పనిలో బిజీగా ఉన్నాడట. తొందరలోనే సినిమాలోని ఇంకో హీరో గురించి క్లారిటీ రావొచ్చు.

రామ్ చరణ్ ప్రస్తుతం ఆచార్య సినిమా కోసం తూర్పు గోదావరి షూట్ చేస్తున్నాడు. ఆచార్య మే నెలలో విడుదల అవుతుండగా… ఆర్ఆర్ఆర్ దసరాకు విడుదల కాబోతుంది. శంకర్ సినిమా బహుశా ఆ తరువాతే సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.

ADVERTISEMENT
Latest Stories