రామ్ చరణ్ సక్సెస్ అయ్యాడు… అల్లు అర్జున్ మిస్ అవుతున్నాడు

Ram Charan is successful Allu Arjun is missingసుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం ఆయన కెరీర్ లోనే గేమ్ ఛేంజర్ గా మారింది. అప్పటిదాకా చరణ్ కు ఉన్న ఇమేజ్ ఆ సినిమాతో పూర్తిగా మారిపోయింది. సినిమాలో చరణ్ లుక్స్ తో పాటు యాక్టింగ్ కి కూడా మంచి మార్కులు పడ్డాయి.

సుకుమార్ రంగస్థలం లానే… డిఫరెంట్ లుక్ తో మాస్ కథ తో ఇంకో కథ రాసుకుని పుష్ప అనే పేరిట అల్లు అర్జున్ తో తీస్తున్నాడు. రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ తరువాత సుకుమార్ నుండి… అలాగే అల వైకుంఠపురంలో తరువాత బన్నీ నుండి వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు భారీగానే ఉన్నాయి.

ADVERTISEMENT

అయితే సినిమా విషయంలో పుష్ప టీమ్ వావ్ ఫాక్టర్ మిస్ అవుతుంది అని అనిపిస్తుంది. రంగస్థలం సినిమా సమయంలో రామ్ చరణ్ లుక్ చివరి వరకు సీక్రెట్ గానే ఉంది. ట్రైలర్ లో ఆయా లుక్ చూడగానే ఫ్యాన్స్ ఎక్సైట్ అయ్యారు. అయితే పుష్ప విషయంలో మాత్రం మార్చి లోనే మొదటి టీజర్ విడుదల చేసేశారు.

అంతటితో ఆగకుండా సినిమాలోని బన్నీ కి సంబంధించిన స్టిల్స్ వరుస పెట్టి లీక్ అవుతూనే ఉన్నాయి. పుష్ప రెండు భాగాలుగా వస్తుంది. మొదటి భాగం క్రిస్మస్ కి విడుదల కానుంది. అంటే ఇంకా ఐదు నెలల సమయం ఉంది. ఇన్ని లీక్స్ మధ్యలో సినిమా విడుదల నాటికి బన్నీ లుక్, గెట్ అప్ మీద ఎక్సయిట్మెంట్ మొత్తం పోయే ప్రమాదం ఉంది.

ఇక నైనా ఈ లీక్స్ ను ఎలాగోలా ఆపే ప్రయత్నం చెయ్యాలి చిత్ర బృందం.

ADVERTISEMENT
Latest Stories