Telugu

ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ తో మరో సారి రామ్ చరణ్

ఆర్‌ఆర్‌ఆర్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చేతిలో ఉన్న మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, తన తదుపరి విషయానికి సంబంధించి ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. వివిధ దర్శకులతో అతని తదుపరి చిత్రం గురించి అనేక ఊహాగానాలు వచ్చినప్పటికీ, అధికారికంగా ఏమీ ప్రకటించబడలేదు.

ఇప్పుడు, తాజా సమాచారం ఏమిటంటే, చరణ్ విజయవంతమైన యువదర్శకుడు అనిల్ రావిపుడితో కలిసి ఆర్ఆర్ఆర్ తరువాత తన తదుపరి ప్రాజెక్ట్ కోసం చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నాడట. ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాత డివివి దానయ్య చరణ్-అనిల్ ప్రాజెక్టును నిర్మించనున్నాడని బజ్ ఉంది.

ADVERTISEMENT

దానయ్య గతంలో రామ్ చరణ్ తో నాయక్, బ్రూస్ లీ, వినయ విధేయరామ చిత్రాలు చేశాడు. ఈ వార్త నిజమైతే ఇది వారిద్దరి కాంబినేషన్ లో ఐదవ సినిమా. అయితే కొంత మేర నాయక్ తప్ప ఇంతకు ముందు వారు చేసిన సినిమాలన్నీ నిరాశపరిచాయి. దీనితో రామ్ చరణ్ దానయ్యకు ఇంకో సినిమా చేస్తున్నాడట.

రంగస్థలంతో అన్ని రకాలుగా ఇంప్రూవైన రామ్ చరణ్ కామెడీలో తనను తాను ప్రూవ్ చేసుకోవాలి. అనిల్ కామెడీ సినిమాలకు పెట్టింది పేరు. దీనితో ఇది రామ్ చరణ్ కు మంచి అవకాశం. పైగా అనిల్ సినిమాలు మినిమం గారంటీ కూడా. దీనితో ఈ కాంబినేషన్ సెట్ కావాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Suriya’s Scene: Will the Trailer Turn the Tide?

Following the back to back commercial success of Karuppu and Vishwanath and Sons, Suriya is…

5 minutes ago

AP Municipal Elections Rescheduled to November 1

The Andhra Pradesh State Election Commission (SEC) has rescheduled municipal elections in 99 urban local…

26 minutes ago