
నేను పవన్ కళ్యాణ్ కు పెద్ద ఫ్యాన్ అంటూనే పవన్ ను వెన్నుపోటుతో పాటు చాల పోట్లు పొడిచారు వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ. మెగా ఫ్యామిలీ అంటేనే కించపరిచే విమర్శలు చేస్తూ ఎప్పుడు మెగా అభిమానుల నోటికి పని చెప్పే వర్మ తాజాగా తన వ్యుహం సినిమా ఫంక్షన్ లో మాట్లాడుతూ పవన్ ను తీవ్రంగా అవమానించి పవన్ అభిమానుల ఆక్రోశానికి మరోసారి సాక్షిగా నిలిచారు.
తెలంగాణ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన బర్రెలక్కతో పవన్ ను పోలుస్తూ పవన్ కంటే బర్రెలక్కే బెటర్ అంటూ మాట్లాడారు. బర్రెలక్క బర్రెలను కాపలాకాస్తూ అటు ఇటు తిప్పుతుంది కానీ సినిమాలలో సూపర్ స్టార్ అయిన పవన్ చంద్రబాబు చేతిలో ‘బర్రె’లెక్క మారిపోయాడు అంటూ మాట్లాడి పవన్ సహనాన్ని పరీక్షిస్తున్నాడు రాంగోపాల్ వర్మ. బర్రెలక్క ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఫేమస్ అయితే ఆర్జీవీ లాంటి పరాన్న జీవి ప్రభుత్వానికి తొత్తుగా మారి,జగన్ దగ్గర ప్యాకేజీ తీసుకుని జగన్ చేతిలో ‘బర్రె’లెక్క తయారయ్యారని, ఆర్జీవీ కంటే ఆ బర్రెలక్కే చాల బెటర్ అంటూ పవన్ ఫాన్స్ ఆర్జీవికి అంతే ఘాటుగా బదులిస్తున్నారు.
గతంలో పవన్ కళ్యాణ్ ను విమర్శించడానికి పావుగా వాడుకున్న కత్తి మహేష్ పరిస్థితి ఏమయ్యిందో, అలాగే 40 ఇయర్స్ పృథ్విని తమ రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ ఎలా వాడుకుని వదిలేసిందో, 2019 ఎన్నికలలో వైసీపీ గెలుపుకి వ్యూహాలు రచించి అమలుచేసిన ప్రశాంత్ కిషోర్ నీ ఇప్పుడు ‘ఛీ’ అంటూ మాట్లాడుతున్న వైసీపీ నాయకుల తీరు చూస్తే ఆర్జీవీ ఫ్యూచర్ ఏమిటో మాకు అర్ధమవుతుంది అంటున్నారు పవన్ అభిమానులు.
ప్రత్యర్థుల పై విమర్శలు చేయడానికి కూడా ఒక బోర్డర్ లైన్ అనేది ఉంటుంది. దానిని వైసీపీ నేతలు, వారికి మద్దతు తెలిపే పోసాని, ఆర్జీవీ లాంటి వారు ఎప్పుడో దాటేసారు. అధికార పార్టీ అండ ఉంది కదా అని మరీ ఇంతలా రెచ్చి పోయి అహంకార పూరిత విమర్శలకు పాల్పడితే చివరికి అదే అధికారం కోల్పోతే వచ్చే పరిణామాలను కూడా ఒక్కసారి దృష్టిలో ఉంచుకోవాలిగా అంటూ హెచ్చరిస్తున్నారు పవన్ అభిమానులు.
ఎందరో మహా నేతలకే ఓటమి భారం తప్పలేదు అలాంటిది జగన్ కి, జగన్ ను చూసుకుని రెచ్చేపోయే ఇటువంటి వారికి ఆ ఓటమి భయాన్ని వచ్చే ఎన్నికలలో తమ ఓటుతో కచ్చితంగా రుచి చూపిస్తాం అంటూ ఆవేశంతో ఊగిపోతున్నారు పవన్ అభిమానులు, జనసైనికులు.
A Reddit post has gone viral for claiming that the cybersecurity firm Fortinet has laid…
An Indian F-1 student finds herself in serious trouble. A misunderstanding at Walmart has left…