ఎఫ్ సియూకే… హీరోగా ఫ్రెష్ ఫేస్

 Ram Karthik Father Chitti Umaa Kaarthikవిలక్షణ నటుడు జగపతి బాబు ప్రధాన పాత్రలో యువ జంట కార్తీక్, అమ్ము అభిరామి నటిస్తున్న తాజా చిత్రం ‘ ఫాదర్- చిట్టి – ఉమ – కార్తీక్’. జనవరిలో విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్న ఈ చిత్రం ప్రమోషన్లు వినూతనంగా జరుగుతున్నాయి. రోజుకు ఒక క్యారెక్టర్ చప్పున స్పెషల్ పోస్టర్లు విడుదల చేస్తున్నారు.

జగపతి బాబు, ఒక చిన్న పాప సహశ్రిత, అమ్ము అభిరామి పోస్టర్లు ఇప్పటికే విడుదల చెయ్యగా… తాజాగా హీరో కార్తీక్ పోస్టర్ విడుదల చేశారు. తాజాగా విడుదలైన ‘ఫాదర్ – చిట్టి – ఉమ – కార్తీక్’ పోస్టర్ లో హీరో లవర్ బాయ్ లుక్ లో అందంగా కనిపిస్తున్నాడు. అతని పాత్ర గురించి పెద్దగా హింట్లు లేకపోయినా రొమాంటిక్ క్యారెక్టర్ అని తెలుస్తుంది.

ADVERTISEMENT

రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తుండగా శివ.జి ఛాయాగ్రహణం అందించారు. శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ పై మంచి టేస్ట్ ఉన్న నిర్మాత ఎల్. దామోదర్ ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

ఈ చిత్ర నిర్మాణం ఇప్పటికే పూర్తి అయిపోయింది. సినిమా టైటిల్, టైటిల్ లోగో… నుండి అన్ని స్పెషల్ గా చూపిస్తున్నారు. ట్రైలర్ కూడా బాగా వచ్చిందని అంటున్నారు. జనవరి బరిలో ఇప్పటివరకు ప్రకటించిన సినిమాలలో ఫ్యామిలీ సినిమాలు లేవు… ఈ చిత్రం ఆ లోటుని భర్తీ చేస్తుందా అనేది చూడాలి.

ADVERTISEMENT
Latest Stories