Telugu

రామ్మోహన్ కు చేదు అనుభవాలు…

ఎక్కడో శ్రీకాకుళం వంటి మారుమూల ప్రాంతంలో ఒక ప్రాంతీయ పార్టీ నేతగా మొదలైన కింజరపు రామ్మోహన్ నాయుడు రాజకీయ జీవితం అంచలంచెలుగా ఎదుగుతూ ఎంపీ గా, కేంద్ర మంత్రిగా ఒక ఉన్నత స్థాయికి చేరుకుంది.

2014, 2019, 2024 లో ఏపీ శ్రీకాకుళం లోక్ సభ నియోజకవర్గం నుండి తెలుగు దేశం ఎంపీ గా బరిలోకి దిగిన నాయుడు మూడు సార్లు విజయకేతనం ఎగరేసి హ్యాట్రిక్ కొట్టారు. ఆ స్థానాన్ని పార్టీ కంచుకోటగా మార్చారు.

ADVERTISEMENT

2019 ఎన్నికలలో వైసీపీ హవా కొనసాగినప్పటికీ ఆ సమయంలో కూడా తన గెలుపుతో శ్రీకాకుళం లోక్ సభ నియోజకవర్గంలో టీడీపీ జెండా రెపరెపలాడించారు. పార్టీ కి వీరవిధేయుడిగా, పార్టీ అధినేత చంద్రబాబు, లోకేష్ కి నమ్మిన బంటులా రామ్మోహన్ పార్టీలో తనకంటూ ఒక మంచి గుర్తింపు, గౌరవం సంపాధించునుకున్నారు.

ఆ గుర్తింపు, గౌరవమే నేడు ఎన్డీఏ ప్రభుత్వంలో ఆయనకు కేంద్ర మంత్రి హోదా కల్పించింది, కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా కూర్చోబెట్టింది. రాజకీయాలలోకి యువత రావాలి, రాష్ట్ర భవిష్యత్ తో పాటు పార్టీ భవితవ్యం కూడా యువతదే అని నమ్మి అడుగులేసే బాబూ, రామ్మోహన్ వంటి యువ నాయకులను ప్రోత్సహిస్తూ వారికి తమ పార్టీ తరుపున కేంద్ర మంత్రి బాధ్యతలు అప్పగించారు.

చిన్న వయస్సులోనే రామ్మోహన్ కి ఇటువంటి అవకాశం రావడం అదృష్టమే అనుకున్నప్పటికీ ఆ అదృష్టం ఇలా కొన్ని చేదు ఘటనలు రూపంలో మసగ బారుతుంది. రామ్మోహన్ కేంద్ర విమానయాన శాఖకు మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత జరిగిన కొన్ని ఘటనలు ఆయనకు చేదు అనుభవాలుగా మారుతున్నాయి.

ముందుగా జూన్,12, 2015 అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం గురించి చెప్పుకోవాలి. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న వారిలో ఒక్కరు మినహా అందరు సజీవ సమాదులయ్యారు. దానికి తోడు ఈ విమానం మెడికోల హాస్టల్ మీద కూలడంతో వారిలో కొంతమంది కూడా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మీద ఈ విమాన ప్రమాదంలో 260 మంది ప్రాణాలు గాలిలో ఆవిరయిపోయాయి.

ఇక తరువాత విమాన ప్రమాదాలు అని చెప్పలేం కానీ తాజాగా ఇండిగో వివాదం మరోసారి రామ్మోహన్ ని వార్తలలో నిలిపింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త ఎయిర్ లైన్స్ నిబంధలు మేరకు పైలెట్లకు 48 గంటల విశ్రాంతి తప్పనిసరి అనేదాని పై సిబ్బంది కొరత అంటూ ఇండిగో ఎయిర్ లైన్స్ పాసెంజర్లకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా వేల కొద్ది ఫలైట్లను అప్పటికప్పుడు రద్దు చేసింది.

దీనితో ఇంటర్ నేషనల్ విమానాశ్రయాలు కాస్త రోడ్డు మీద ఉండే బస్ స్టాండ్ల మాదిరి, పండుగ సమయాలలో రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ల మాదిరి తయారయ్యాయి. అలాగే అనేకమంది సమయానికి గమ్యస్థానం చేరుకోలేక, అసలు ఎప్పుడికి చేరుకుంటామో కూడా తెలియక రోజుల కొద్దీ విమానాశ్రయంలోనే పడిగాపులు పడ్డారు.

దీనితో అటు ప్రతిపక్షాలు ఇటు ప్రజలు కూడా ఆయా శాఖ మంత్రి పై విమర్శలు గుప్పించారు. అలా ఈ ఇండిగో ఫ్లయిట్ ల రద్దు కూడా కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ కు చేదు అనుభవాలే మిగిల్చింది. ఇక ఇప్పుడు తాజాగా మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవర్ ఫ్లయిట్ కూలిపోవడం కూడా మంత్రిగా రామ్మోహన్ జవాబుదారిగా మారారు.

అజిత్ పవర్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురి కావడంతో ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తో పాటు మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై వెంటనే దర్యాపు జరిపించాలంటూ నాయుడికి మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ లేఖ రాసారు. అలాగే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలంటూ సూచనలు చేసారు.

అయన లేఖకు సమాధానం గా ఇప్పటికే ప్రమాదం పై AAIB దర్యాప్తు ప్రారంభించిందని, బ్లాక్ బాక్స్ ని స్వాధీనం చేసుకుని సమాచారాన్ని సేకరిస్తున్నట్టు, భవిష్యత్ లో ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటామంటూ బదులిచ్చారు రామ్మోహన్.

అయితే రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా తన హయాంలో ఎన్ని అభివృద్ధి పనులు చేపట్టినా, ఎన్ని ప్రాంతాలకు విమాన సదుపాయాలు కల్పించినా తన ప్రమేయం లేకుండా జరిగిన ఇటువంటి ప్రమాదాలు, అటువంటి వివాదాలు మాత్రం ఆయన పొలిటికల్ కెరీర్ లో ఒక బ్లాక్ మర్క్స్ గానే నిలుస్తాయి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Trivikram’s God of War: NTR Fans Panic After AK47 Fiasco

NTR fans are growing anxious about Trivikram’s ambitious mythological project, tentatively titled God of War,…

2 hours ago

IND vs WI T20: Sarpanch Destroys WI! Nightmare Begins?

Team India started the T20I series against West Indies with a complete performance in Lucknow.…

3 hours ago