గ్యారేజ్ లో… రికార్డులు సెట్ చేయబడును..!

ram-pothineni-birthday-wishes-to-ntrజూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న “జనతా గ్యారేజ్” ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు వీక్షకుల నుండి విశేషమైన స్పందన లభించింది. ఈ పోస్టర్స్ పై ఎవరికీ తోచిన కామెంట్స్ వారు చేసిన సంగతి తెలిసిందే. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ‘బృందావనం’ సినిమాలో డైలాగ్ ను రిపీట్ చేసి, ‘బుడ్డోడు’ అభిమానులను అలరించగా, నవతరం హీరో రామ్ కూడా అదే బాటలో ఒక పంచ్ ను వేసి జూనియర్ ఫ్యాన్స్ లో నూతన ఉత్తేజాన్ని నింపారు.

“జనతా గ్యారేజ్” సినిమాకు ఉన్న క్యాప్షన్ ‘ఇచ్చట రిపేర్లు చేయబడును’ అనే దానిని కాస్త సవరిస్తూ… ‘ఇచ్చట అన్ని రికార్డులు సెట్ చేయబడును’ అని సినిమా రిలీజ్ తర్వాత మారాలని కోరుకుంటున్నా… అంటూ రామ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో సందడికి కారణమైంది. ప్రస్తుత తరం హీరోలు బాలీవుడ్ హీరోల మాదిరి ప్రవర్తిస్తుండడంతో ఒకరికొకరు విష్ చేసుకోవడం, ఒకరి వేడుకలకు మరొకరు హాజరు అవుతుండడం ఆహ్వానించదగ్గ పరిణామం.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories