‘ధృవ’ అఫిషియల్ లుక్ – చెర్రీ ఇంట్రెస్టింగ్!

Ramcharan Druva First Lookరామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘ధృవ’ సినిమా రెండవ షెడ్యూల్ ను పూర్తి చేసుకుని, మూడవ షెడ్యూల్ కోసమని కాశ్మీర్ పయనమవుతోంది. ఈ విషయాన్ని సినిమా దర్శకుడు సురేందర్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘రామ్ చరణ్ తో వర్క్ చేయడం మంచి అనుభూతిని పంచుతోందని, సెట్స్ లో అందరూ ఎనర్జిటిక్ గా ఫీల్ అవుతున్నారని’ సురేందర్ రెడ్డి అభిప్రాయ పడ్డారు. ఈ సందర్భంగా పోస్ట్ చేసిన ఫోటోకు ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

సైడ్ యాంగిల్ లో ఉన్న చెర్రీ ఫేస్ లోని కన్ను నుండి గణిత శాస్త్ర సూత్రాలను లెక్కిస్తున్నట్లు కనపడుతున్న ఫోటో ఆసక్తికరంగా ఉంది. సినిమా కాన్సెప్ట్ ను మొదటి పోస్టర్ నుండే ప్రేక్షకులకు చేరువ చేయాలనే ప్రయత్నం చిత్ర యూనిట్ లో స్పష్టంగా కనపడుతోంది. ‘నాన్నకు ప్రేమతో’ మాదిరి ‘మైండ్ గేమ్’ చుట్టూ సినిమా కాన్సెప్ట్ తిరుగుతుందన్న విషయాన్ని రీమేక్ ఖరారు చేసింది. దానికి తగిన విధంగానే చెర్రీ లుక్ ను డిజైన్ చేసినట్లుగా కనపడుతోంది. ఫస్ట్ లుక్ ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో అభిమానులు ఫుల్ హ్యాపీ!

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories