అందరూ లాక్ డౌన్ గొడవలో ఉండగా…. రానా దగ్గుబాటి హఠాత్తుగా తాను ప్రేమలో ఉన్నా అని, మిహీక బజాజ్ అని తాను చేసుకోబోయే అమ్మాయిని పరిచయం చేసేశాడు అందరికీ. ప్రేమ గురించి, పెళ్లి గురించి సహజంగానే రానాని ప్రతి ఇంటర్వ్యూలోనూ అడిగే వారు అయితే ఎక్కడా అతను ఒక హింట్ కూడా ఇవ్వలేదు ఎప్పుడూ.
సురేష్ బాబు డిసెంబర్ లో పెళ్లి ఉండొచ్చు అని చెప్పుకొచ్చారు. అయితే ఉన్నఫళంగా రానా ఎంగేజ్మెంట్ జరగబోతుందని వార్తలు వస్తున్నాయి. ఈరోజు సాయంత్రం రామానాయుడు స్టూడియోలో కేవలం అతికొద్ది మంది కుటుంబసభ్యుల మధ్య ఈ వేడుక జరగబోతుందని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటనా లేదు.
అయితే ఈ సారి కనీసం మీడియాకు ఎలాగోలా తెలిసింది. ప్రస్తుతం మిహికా ముంబైలోని డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియో పేరిట ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థను రన్ చేస్తోంది. భారతీయ వాస్తు శాస్త్రాన్ని ఎంతో ఇష్టపడే మిహిక ముంబాయిలోని రచన సంసద్ విద్యాలయం నుంచి ఇంటీరియల్ డిజైనింగ్‌లో డిప్లొమా అందుకుంది. అంతేకాదు లండన్‌లోని చెల్సియా యూనివర్సిటీలో ఆర్ట్ అండ్ డిజైనింగ్‌లో ఎంఏ చేసింది.
ఇక… రానా ప్రస్తుతం బహుళ భాషా ప్రాజెక్ట్, హాతి మేరే సాతి విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల కావాల్సి ఉన్నా లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. రానా మరో చిత్రం, విరాటపర్వం షూటింగ్ చివరి దశలో ఉంది. రానా యొక్క ప్రొడక్షన్ వెంచర్, ‘కృష్ణ అండ్ హిస్ లీలా’ థియేట్రికల్ విడుదల కాకుండా నేరుగా ఆన్‌లైన్‌లో విడుదల చేయవచ్చని వార్తలు వస్తున్నాయి.





