అదేంటి రవికుమార్… చిన్న తప్పేగా?

పరకామణిలో 9 డాలర్లు (జగన్‌ లెక్క: రూ.72,000) చోరీ చాలా చిన్న కేసు. అందుకు రవికుమార్ రూ.14 కోట్లు టిటిడీకి చెల్లించి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. కనుక ఆయనని క్షమించేశామని మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి మొన్ననే ప్రెస్‌మీట్‌లో క్లీన్ చిట్ జారీ చేశారు.

కానీ జగన్‌ చిన్న చోరీ కేసని చెప్పి క్షమించేసి, క్లీన్ చిట్ కూడా ఇచ్చేసిన సంగతి రవికుమార్‌కి తెలియనట్లుంది. అందుకే ఆయన నిన్న మీడియాకు ఓ వీడియో సందేశం విడుదల చేశారు.

ADVERTISEMENT

దానిలో “ఇది చాలా పెద్ద తప్పు. మహా పాపం. ఇంత పెద్ద తప్పు, పాపం చేసినందుకు నేను, నా భార్య పిల్లలు కన్నీళ్ళు పెట్టుకొని బాధపడని రోజు లేదు. అందుకే నా ఆస్తులలో 90 శాతం టిటిడీకి సమర్పించి ప్రాయశ్చిత్తం చేసుకున్నాను.

కనుక స్వామి వారి భక్తులు అందరూ దయచేసి మా బాధని అర్థం చేసుకుని నా తప్పును క్షమించమని చేతులు జోడించి వేడుకుంటున్నాను,” అని రవికుమార్ వెక్కివెక్కి ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టుకున్నారు.

ఆయనని జగన్‌, వైసీపీ నేతలు వెనకేసుకువస్తుంటే, ఆయన కూడా ఈ వీడియోలో వారిని వెనకేసుకు వస్తూ మాట్లాడటం విశేషం.

“నన్ను కొందరు బ్లాక్ మెయిల్ చేసిన మాట వాస్తవం. వారిపై నేను కేసులు కూడా పెట్టాను. కానీ వైసీపీ నేతలు నన్ను బెదిరించి, భయపెట్టి నా ఆస్తులు వారి పేరిట వ్రాయించుకున్నారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. ఈ ప్రచారంతో నేను, నా కుటుంబం తీవ్ర మనోవేదన అనుభవిస్తున్నాము.

నేను ఎవరికీ డబ్బు, ఆస్తులు ఇవ్వలేదు. అయినా నా ఆస్తులు ఎవరికో ఎందుకు వ్రాసిస్తాను?ఈ ఆస్తుల పంపిణీ గురించి ఎలాంటి విచారణకైనా నేను సిద్ధమే,” అన్నారు.

పరకామణి దొంగతనం బయటపెట్టి పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేసిన మాజీ విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్‌, తిరుపతిలో సిట్ విచారణకు గుంతకల్లు నుంచి రైల్లో బయలుదేరగా దారిలో హత్యకు గురయ్యారు. అది ఆత్మహత్య అని వైసీపీ సర్టిఫై చేసింది. దానికి కూటమి ప్రభుత్వం వేధింపులే అని తేల్చి చెప్పేసింది.

కానీ పరకామణిలో దొంగతనం చేసి వైసీపీ నేతల మధ్యవర్తిత్వంతో కేసు సెటిల్మెంట్ చేసుకున్న రవికుమార్, ఇన్ని అవమానాలు, వేధింపులు భరిస్తూ ఇలా కుమిలిపోతున్నా కూడా వైసీపీ నేతలను ఇలా వెనకేసుకు వస్తున్నారు. అంటే అర్ధం ఏమిటి?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Fake Account On PK, Targeted Lokesh, But Got Arrested

The NDA leadership in Andhra Pradesh has repeatedly raised concerns about alleged attempts to create…

13 minutes ago

RC17 Launch: Can Sukumar Break His Problematic Habit?

Ram Charan fans have plenty of reasons to be frustrated with Peddi. The film had…

43 minutes ago