Telugu

చిన్నస్వామి..ఎవరి ఆశల మీద నీళ్లు జల్లుతుందో..?

నేడు ఐపీఎల్ 2024 సీజన్ లోనే ఒక ఉత్కంఠ మ్యాచ్ కు బెంగుళూరు చిన్న స్వామి స్టేడియం వేదిక కానుంది. ఈ సీజన్ లో ఇప్పటికే మూడు జట్టులు నేరుగా ప్లేఆఫ్స్ కు క్వాలిఫై అవ్వగా, ఆ మిగిలిన ఒక్క చోటు కు ఇవాళ రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు vs చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి.

ఈ సీజన్ ఓపెనింగ్ మ్యాచ్ కూడా ఈ ఇరు జట్లే ఆడగా, ఆ మ్యాచ్ లో చెన్నై పై చేయి సాధించింది. అయితే ఆ మ్యాచ్ లో ఓడిన బెంగళూరు జట్టు, వారు ఆడిన తొలి 8 మ్యాచ్లలో, కేవలం ఒక్కటి మాత్రమే గెలిచి, ఆ జట్టు ఈ ఐపీఎల్ 2024 లో నే మొట్ట మొదటిగా నిష్క్రమించబడే జట్టు గా నిలుస్తుంది అనుకున్నారు అంతా.

ADVERTISEMENT

అయితే బెంగళూరు జట్టు మాత్రం తమ ఆత్మ విశ్వాసాన్ని ఎక్కడా కోల్పోకుండా, ఆ తరువాత ఆడిన 5 కు 5 మ్యాచ్లలోనూ గెలిచి, చాల టీమ్స్ కు షాక్ ఇచ్చి రేసులో నిలబడింది. అయితే మొదటిలో మెరుగైన ప్రదర్శనను కనబరిచిన చెన్నై జట్టు, టోర్నీ మధ్య క్రమం లో కాస్త గాడి తప్పినట్లు కనిపించినప్పటికీ కీలకమైన మ్యాచ్లలోతమ సత్తా చూపించారు చెన్నై ప్లేయర్స్. దీనితో వారు కూడా ఆర్సీబి తో పాటుగా ఇంకా ప్లేఆఫ్స్ రేస్ లో ఫేవరేట్ గా నిలిచారు.

అయితే ఇవాళ జరగబోయే మ్యాచ్ ఒక వర్చ్యువల్ నాక్అవుట్ గానే మారనుంది. నేడు గెలిచిన జట్టు మాత్రమే ప్లే ఆఫ్స్ కు అర్హత ను సాధిస్తాయి. అయితే, బెంగళూరు జట్టు మాత్రం కొన్ని షరతులకు లోబడి విజయాన్ని అందుకోవాల్సి ఉంటుంది. అందులో మొదట బ్యాటింగ్ చేస్తే ప్రత్యర్థి జట్టు మీద కనీసం 18 పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుంది.

అలా కాకుండా ఛేజింగ్ ఎంచుకుంటే ప్రత్యర్థి జట్టు ఇచ్చిన టార్గెట్ ని 18 వర్ల లోపే ముగించాల్సి ఉంటుంది. అయితే చెన్నై జట్టుకి ఇటువంటి షరతులు ఏమి లేవు. కేవలం విజయం అందుకుంటే చాలు. అందుకే ఈ మ్యాచ్ల్లో టాస్ కీలక పాత్ర పోషించబోతుంది. అయితే ఇప్పటికి వరకు ఒక్క సరి కూడా ఐపీల్ కప్పు చేజిక్కించుకోపోయిన ఆర్సీబీ జట్టుకు హార్ట్ కౌర్ అభిమానులు ఉంటూనే ఉన్నారు. దీనితో ఈ కీలక మ్యాచ్లో ఎలా అయినా చెన్నై జట్టు మీద విజయం సాధించి తమ ప్లే అఫ్ ఆశలు నిలబెట్టాలని ఆర్సీబీ ఫాన్స్ దేవాలయాలలో పూజలు కూడా చేస్తున్నారు.

అదీకాకుండా మే 18 సెంటిమెంట్ మీద కూడా ఆర్సీబీ ఫాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 2013 , 14 , 16 ,23 సంవత్సరాలలో ఈ తేదీన ఆర్సీబీ ఆడిన అన్ని మ్యాచ్లలోను విజయం సాధించింది. అలాగే ఈ ఉత్కంఠ మ్యాచ్ కు వర్ష అడ్డుపడుతుంది అని భయపడ్డ ఇరు జట్ల అభిమానులకు ప్రకృతి కూడా సహకరించడంతో ఇటు ప్రకృతితో పాటు సెంటిమెంట్ కూడా తమ పక్షానే నిలబడుతుంది అన్న దృఢ నిశ్చయంతో ఉన్నారు ఆర్సీబీ అభిమానులు.

అయితే చెన్నై కానీ ఈ మ్యాచ్ లో ఆర్సీబీ చేతిలో ఓటమి పాలైతే ధోనికి ఇదే చివరి మ్యాచ్ అంటూ ప్రచారం జరగడంతో చెన్నై ఫాన్స్ కూడా ఈ మ్యాచ్ ఎట్టి పరిస్థితులలోను గెలిచి తీరాల్సిన ఒత్తిడిని ఎదుర్కొంటుంది. కోహ్లీ కూడా పరోక్షంగా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో తలా ఫాన్స్ ఈ మ్యాచ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్లో నెగ్గితే ధోనిని మరోసారి క్రికెట్ గ్రౌండ్ లో చూసే అవకాశం ఉంటుంది.

అయితే ఇంతటి ప్రాధాన్యత ఉన్న మ్యాచ్ కు వర్షం అడ్డంకి గ మారవచ్చునని, గత కొన్ని రోజులు ప్రచారం జరగడంతో చిన్న స్వామి స్టేడియం ఎవరి ఆశల మీద నీళ్లు జల్లుతుందో అనే భయంలో ఇరు జట్ల అభిమానులు ఉన్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

‘వంగవీటి’ బ్రాండ్ నేమ్ జనసేన కు మరింత బలం కానుందా.?

ఏపీలో మోగిన స్థానిక ఎన్నికల సైరన్ తో రాష్ట్ర రాజకీయాలలో వినూత్న మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అందులో భాగంగా ఏపీ రాజకీయాలకు…

8 minutes ago

Pan-India Craze: Telugu Stars Ignoring a Huge Fan Base?

Baahubali took South cinema to the next level. SS Rajamouli showed the industry that regional…

28 minutes ago