
రమ్య ట్వీట్‌పై దుమారం చెలరేగడంతో మరోమారు స్పందిస్తూ… పాట్ అంటే ‘పొటాటోస్, ఆనియన్స్, టమోటాస్’ అని ఎందుకు అనుకోకూడదంటూ తనను తాను సమర్థించుకున్నారు. అయితే బీజేపీ నేతలు మాత్రం ‘డ్రగ్స్ మత్తు’ అనే అర్థంలోనే ఆమె ఆ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తున్నారు. దేశ ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రమ్యపై చర్యలు తీసుకోవాల్సిందేనని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
రమ్య ట్వీట్‌లోని అర్థమేంటో తనతో సహా దేశంలోని బీజేపీ నేతలెవరికీ తెలియదని, కానీ రాహుల్‌కు మాత్రం వెంటనే అర్థమైపోయిందని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. కాగా రమ్య ట్వీట్‌పై విమర్శలు వెల్లువెత్తడంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. రమ్యతో సహా ఎవరూ వ్యక్తిగత విమర్శలు చేయవద్దని పార్టీ నేతలకు సూచించారు.
Pawan Kalyan’s birthday is almost here, and OG 2 is naturally one of the projects…
Prabhas has reached a point where the problem is no longer finding big films. It…