రేవంత్‌ ప్రభుత్వం కూలిపోతుందని ఆశపడితే….

ఇంతకాలం తెలంగాణ అంటే కేసీఆర్‌… కేసీఆర్‌ అంటే తెలంగాణ. ఆ రెండూ అంటే బిఆర్ఎస్ పార్టీ అన్నట్లు ఉండేది. బిఆర్ఎస్ పార్టీని విమర్శించడం, వ్యతిరేకించడం అంటే తెలంగాణను వ్యతిరేకించడమే అనే భావన బిఆర్ఎస్ నేతలు ప్రజల మనసులలోకి బాగా ఎక్కించేశారు. అందుకే తెలంగాణ ఉద్యమాలలో కేసీఆర్‌తో కలిసి పోరాడిన ప్రొఫెసర్ కోదండరామ్‌పై సైతం ‘తెలంగాణ వ్యతిరేకి’ అనే ముద్ర వేయగలిగారు.

అయితే మొదటిసారిగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రేవంత్‌ రెడ్డి పరిపాలన చేతకాక చేతులెత్తేస్తారని, మంత్రి పదవుల కోసం కాంగ్రెస్‌ నేతలు కీచులాడుకొని తమ ప్రభుత్వాన్ని తామే కూల్చేసుకొని చివరికి తమ కాళ్ళవద్దకే వస్తారని కేసీఆర్‌, కేటీఆర్‌ ఆశగా ఎదురుచూస్తుంటే, కేవలం 15 రోజులలోనే రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై, తన మంత్రులపై పట్టు సాధించడమే కాకుండా చాలా పాపులర్ అయిపోయారు కూడా. ఎంతగా అంటే అప్పుడే కేసీఆర్‌ని మరపించే అంతగా!

ADVERTISEMENT

అయితే బిఆర్ఎస్‌ నేతలకు ఇంతకంటే చాలా పెద్ద సమస్య ఎదురవబోతోంది. కేసీఆర్‌తో సహా మాజీ మంత్రులందరినీ ఒకేసారి పట్టేయడానికి రేవంత్‌ రెడ్డి పెద్దవలే సిద్దం చేస్తున్నారు. వారి హయాంలో చేసిన అప్పులు, ప్రాజెక్టుల పేరుతో చేసిన అవినీతి పద్దులు తీయించి శాసనసభలో నిలదీస్తున్నారు.

కేవలం నిలదీస్తే పర్వాలేదు కానీ వాటిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయవిచారణ జరిపించబోతున్నట్లు శాసనసభలోనే ప్రకటించారు. తొలిసారిగా సిఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌ రెడ్డి 15 రోజులలోనే తమను ఈవిదంగా ముట్టడిస్తారని బహుశః కేసీఆర్‌ కూడా ఊహించి ఉండరేమో?

రేవంత్‌ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలను కేసీఆర్‌ బాగానే పసిగట్టారు. అందుకే అప్పుడే కౌంటర్ అటాక్ చేసేందుకు తమ నేతలని, తగిన వాదనలను, వ్యూహాలను సిద్దం చేసి ఇస్తున్నారు.

బిఆర్ఎస్‌ హయాంలో చేసిన అప్పులు, జరిగిన అవినీతిని రేవంత్‌ బయటపెడుతుంటే, ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలుచేయకుండా తప్పించుకొనేందుకు శ్వేతపత్రాల పేరుతో అబద్దాలు చెపుతున్నారంటూ కేటీఆర్‌ ఎదురుదాడి చేస్తున్నారు.

తొమ్మిదిన్నరేళ్ళపాటు తామందరం రేయింబవళ్లు నిద్రాహారాలు మానుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే, కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ బ్రాండ్ ఇమేజిని దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదంటూ కేటీఆర్‌ హెచ్చరిస్తున్నారు.

అయితే కాంగ్రెస్‌ పావులు కదుపుతున్నది తెలంగాణ ఇమేజ్ దెబ్బతీయడానికి కాదు… ‘కేసీఆర్‌ ఇమేజ్’, ‘బిఆర్ఎస్‌ ఇమేజ్’ అని అందరికీ తెలుసు. ఇంతకాలం తమని దైవాంశసంభూతులుగా ఆరాదించిన తెలంగాణ ప్రజల ముందే తమని తెలంగాణని అప్పులపాలు చేసి ముంచేసినవారిగా, రాష్ట్రాన్ని దోచుకొన్న ద్రోహులుగా నిలబెట్టేందుకు రేవంత్‌ ప్రయత్నిస్తున్నారని బిఆర్ఎస్‌ నేతలకు తెలుసు. కానీ ఆ విషయం బయటకు చెప్పుకోలేరు కనుక ‘తెలంగాణ ఇమేజ్’ దెబ్బ తీస్తే సహించబోమని కేటీఆర్‌ గర్జిస్తున్నారనుకోవచ్చు.

కానీ కేసీఆర్‌ తెలంగాణను అభివృద్ధి చేయడం ఎంత నిజమో ఆ అభివృద్ధి పేరుతో వేలకోట్లు కూడగట్టుకోవడం అంతే నిజమని అందరికీ తెలుసు. ఆ అక్రమార్జన చూసుకొనే కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలనుకొన్నారు. తెలంగాణ ఎన్నికలలో అవలీలగా గెలవగలమని అనుకొన్నారు.

కానీ దేవుడి స్క్రిప్ట్ వేరేగా ఉందని దైవాంశసంభూతుడని పొగిడించుకొనే కేసీఆర్‌ కూడా గ్రహించలేకపోవడమే విచిత్రం. కానీ ఈ దుస్థితి, తాజా పరిణామాలు అన్నీ స్వయంకృతమే కనుక ఎదుర్కోక తప్పదు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

First Breakup, Now Reunion? Prithvi Shaw’s Publicity Stunt?

Cricketer Prithvi Shaw and actor Akriti Agarwal are back together just weeks after calling off…

26 minutes ago

TDP-Jana Sena-BJP: Who Gets the Key Seats?

The TDP, Jana Sena and BJP scripted a major victory in the 2024 Andhra Pradesh…

56 minutes ago