
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కులగణన చేయించి, దమ్ముంటే బీజేపి పాలిత రాష్ట్రాలలో కూడా కులగణన చేయించింది. దమ్ముంటే బీజేపి పాలిత రాష్ట్రాలలో కుల గణన చేయించాలని సిఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు కేంద్రానికి సవాలు విసిరారు.
కానీ కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి, ఈసారి జనాభా లెక్కలతో పాటు కుల గణన కూడా చేయిస్తామని ప్రకటించడంతో సిఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు షాక్ అయ్యారు.
కనుక కుల గణన అంశంతో మోడీ ప్రభుత్వాన్ని రాజకీయంగా ఇరుకున పెట్టాలని వారనుకుంటే, వారి చేతిలో ఉన్న ఈ బలమైన ఆయుధాన్ని మోడీ ప్రభుత్వం ఎత్తుకుపోవడంతో షాక్ అయ్యారు.
ఎందువల్ల అంటే ఈ రోజుల్లో బంగారం కంటే విలువైనది ‘డేటా.’ అందుకే జగన్ ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా ప్రజలకు సంబందించి పూర్తి సమాచారం సేకరించి డేటా బ్యాంక్ తయారుచేసుకుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కుల గణన చేయిస్తే ఆ డేటా అంతా బీజేపి చేతిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు రాబోయే ఎన్నికలలో దానిని ఉపయోగించుకొని కాంగ్రెస్, మిత్ర పక్షాలను దెబ్బతీయగలదు.
కనుక రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఒకటనుకొని కేంద్రానికి సవాలు విసిరితే మరొకటి జరిగిందని స్పష్టమవుతోంది. కానీ ఇప్పుడు చేయగలిగేదేమీ లేదు… ఆ క్రెడిట్ క్లెయిమ్ చేసుకోవడం తప్ప! రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు అదే చేస్తోంది.
కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ దెబ్బకి మోడీ ప్రభుత్వం దిగివచ్చి కుల గణనకి సిద్దపడిందని ‘రిటర్న్ క్రెడిట్’ కోసం ప్రయత్నిస్తున్నారు.
తమ ప్రభుత్వం దేశానికే ఆదర్శప్రాయంగా కుల గణన చేసిందని, మోడీ ప్రభుత్వం కూడా తమ స్పూర్తితో కులగణన చేస్తుండటం చాలా సంతోషమని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. కానీ కేంద్రం ఏకపక్షంగా కుల గణన చేయకుండా అన్ని రాష్ట్రాలను సంప్రదించి చేపట్టాలన్నారు.
ప్రధాని మోడీ తమ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఫాలో అవుతున్నారని, అందుకు తెలంగాణ బీజేపి నేతలు అసూయతో బాధపడుతూ కుల గణన విషయంలో తమ ప్రభుత్వంపై నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతున్నారని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. అయినప్పటికీ ఈ విషయంలో కేంద్రానికి సహకరించేందుకు తమ ప్రభుత్వం సిద్దంగా ఉందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Nani's latest film The Paradise marked one of the most ambitious attempts of his career.…
Vijay Deverakonda appears unfazed by the slow start to Ranabaali’s North American advance bookings. The…