
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార పార్టీ నేతలపై జరుగుతున్న వరుస దాడులకు కాంగ్రెస్ పార్టీ నేతలే కారణమంటూ బిఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ నేతలకే కాదు, రెండు తెలుగు రాష్ట్ర ప్రజలందరికి అర్థమయ్యేలా దీటైన జవాబిచ్చారు టి.కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్ష్యుడు రేవంత్ రెడ్డి.
బిఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్తా ప్రభాకర్ రెడ్డి పై జరిగిన కత్తి దాడి.,అచ్చెమ్ పేటలో బువ్వల బాలరాజు పై జరిగిన రాళ్లదాడికి కారణం కాంగ్రెస్ పార్టీ నేతలే అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్,హరీష్ రావు వంటి ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్యంలో దాడులకు ఆస్కారం లేదని..,ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో దాడుల సంస్కృతికి తెరలేపిందని., ఇటువంటి చర్యలకు పాల్పడితే పర్యవసానాలు అనుభవించాల్సి వస్తుందని కాంగ్రెస్ పార్టీని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.
ప్రభుత్వం మీద మూడు కుట్రలు జరగబోతున్నాయి, పది పదిహేను రోజులలో అవి బహిర్గతం కానున్నాయి అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు రేవంత్ తనదైన స్టైల్ లో బదులిచ్చారు. ప్రజలందరూ ఒక్కవిషయం ఆలోచించాలి….ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న అన్ని రాజకీయ పార్టీలకలో నేతలకు ఎన్నికల ముందు ఇటువంటి దాడులు ఎదురవ్వడం ఎన్నికల తరువాత అవి సద్దుమణిగిపివడం ఒక్కసారి గమనించాలి అంటూ ప్రశాంత్ కిషోర్ ఎన్నిక వ్యూహాలను బయటపెట్టారు రేవంత్.
గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వైసీపీ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పని చేసిన ఈ పెద్దమనిషి 2018 లో విశాఖ ఎయిర్ పోర్టులో వైసీపీ పార్టీ అధ్యక్షుడిగాఉన్న జగన్ మోహన్ రెడ్డి పై కూడా అక్కడి స్థానిక వ్యక్తి కోడికత్తితో దాడి చేయడం…ఆ దాడికి కారణం ప్రత్యర్థి పార్టీ అయినా తెలుగుదేశం పై మోపడం జరిగింది. కానీ ఎన్నిక తరువాత ఆదాడికి టీడీపీ పార్టీకి సంబంధం లేదని అది కేవలం ప్రజలలో సానుభూతిని కలిగించి జగన్ ను సీఎంగా చేయడానికి వేసిన వ్యూహంగా తేలిపోయింది.
అలాగే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విషయంలో కూడా ప్రశాంత్ కిషోర్ ఇదే వ్యూహంతో ముందుకెళ్లి అక్కడ టిఎంసి పార్టీని తిరిగి అధికారంలో తీసుకువచ్చారు. ఇప్పుడు కూడా బిఆర్ఎస్ పార్టీకి ఎన్నిక వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్న నేపథ్యంలో ఈ అధికార పార్టీ నేతల మీద జరిగే దాడులు కూడా వీరి వ్యూహంలో భాగమే అంటూ కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి అధికార పార్టీ రాజకీయ వ్యూహాలను ప్రజలకు విశ్లేషించారు.
రేవంత్ రెడ్డి విశ్లేషణలు క్షుణ్ణంగా గమనిస్తే ఎన్నిక ముందు రాజకీయ పార్టీల నేతల పై జరిగేవి “దాడులు కాదని వ్యూహకర్తలు లీలాలని”..ఇట్టే అర్ధమవుతుంది. ప్రశాంత కిషోర్ 2018 ఆంధ్రప్రదేశ్ లో వేసిన నేతల పై ఈ దాడుల వ్యూహం అక్కడ అంచనాలను మించి ఫలితాన్ని ఇవ్వడంతో ఇక ఇదే తన హిట్ ఫార్ములా గా భావించి తానూ ఏ రాష్ట్రంలో వ్యూహకర్త అవతారం ఎత్తిన ఇక ఇదే స్టాటజీని అమలుచేస్తున్నారంటూ రాజకీయ పార్టీలకే కాదు ప్రజలకు కూడా కొంత వరకు అవగాహనా వచ్చినట్టుంది.
అందుకే “ఎక్కడ చూసిన ఇదేపనా? కొంచెం కూడా బోర్ కొట్టదా?”..అంటూ ప్రశాంత్ టీమ్ ను ఆ టీమ్ ను నమ్ముకున్న పార్టీలను కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అప్ డేట్ అవ్వండి బాస్ ఇక అరిగిపోయిన టేప్ రికార్డర్ మాదిరి ఎప్పుడు ఒకటే స్టాటజీనా? కొంచం మార్చండి. మార్పు మంచిదే అంటూ నెట్టింట మీమ్స్ వండి వడ్డిస్తున్నారు మీమర్స్.
A Reddit post has gone viral for claiming that the cybersecurity firm Fortinet has laid…
An Indian F-1 student finds herself in serious trouble. A misunderstanding at Walmart has left…