Telugu

ముళ్ళ కిరీటం, ముళ్ళ సింహాసనం అయినా నిబ్బరమే!

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. రాష్ట్ర విభజన తర్వాత వెంటనే అధికారంలోకి రావాల్సిన కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికలలో ఓడిపోయింది. దానిని కేసీఆర్‌ మళ్ళీ ఎన్నడూ కోలుకోలేని విధంగా బలహీనపరిచి దెబ్బ తీశారు.

అలాంటి పరిస్థితిలో కూడా కాంగ్రెస్‌ సీనియర్లు పదవులు, సీట్ల కోసం కీచులాడుకుంటూ ఉండేవారు. కనుక అలాంటి పరిస్థితులను, అలాంటి పార్టీని, అలాంటి నేతలను గాడిలో పెట్టడమే అసాధ్యం.

ADVERTISEMENT

కేసీఆర్‌ హయంలో తెలంగాణ రాష్ట్రం, దానిలో రాజకీయ పార్టీలు, వాటి రాజకీయాలు, యంత్రాంగం అంతా కేసీఆర్‌ చెప్పు చేతల్లోనే ఉండేది. తెలంగాణ అంటే కేసీఆర్‌, కేసీఆర్‌ అంటే తెలంగాణ అనే పరిస్థితి ఉండేది.

అదీగాక ‘తెలంగాణ సెంటిమెంట్’ బలంగా ఉంచుతూ ప్రజలను నిరంతరం ఆ ప్రభావంలోనే ఉంచుతూ 2014-2019 వరకు జరిగిన ప్రతీ ఎన్నికలో అలవోకగా విజయాలు సాధిస్తుండేవారు.

ఆయన ధాటికి కాంగ్రెస్‌, బీజేపి, టీడీపి, వామపక్షాలు అన్నీ చిన్నాభిన్నమైపోయాయి. కాంగ్రెస్‌ పార్టీలో కుమ్ములాటలే తప్ప ఐక్యత ఉండేదే కాదు. కాంగ్రెస్‌ అధిష్టానం కర్ర పెత్తనం చేయడమే తప్ప తెలంగాణలో పార్టీని గాడిన పెట్టుకున్న దాఖాలాలు లేవు. గాడిన పెట్టడం అంటే అధ్యక్షుడుని మార్చడమే అన్నట్లు వ్యవహరించేది.

2023 డిసెంబర్‌లో తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్, డబ్బు మూటలు పోలీస్ వాహనాలలోనే తరలించడం నిజమే అనుకుంటే, కాంగ్రెస్‌ ఉన్న పరిస్థితిలో బీఆర్ఎస్‌ పార్టీని ఓడించడం అసంభవం.. అసాధ్యం. కానీ అలా కుమ్ములాడుకుంటున్న నేతలతోనే రేవంత్ రెడ్డి కేసీఆర్‌, బీఆర్ఎస్‌ పార్టీని మట్టి కరిపించారు.

మూడు లేదా ఆరు నెలల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోతుందనుకుంటే రెండేళ్ళలో ఎదురేలేని ప్రభుత్వంగా, తిరుగులేని పార్టీగా నిలబెట్టారు. ఇప్పుడు జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో మరోసారి బీఆర్ఎస్‌ పార్టీని, కేటీఆర్‌ని మరోసారి చావు దెబ్బకొట్టి రాజకీయంగా తనకు తిరుగేలేదని నిరూపించుకున్నారు.

నిజానికి జాతీయస్థాయిలో కాంగ్రెస్‌ పార్టీకి ఇన్ని కష్టాలు, సమస్యలు, సవాళ్ళు లేవనే చెప్పాలి. అయినా బీహార్‌ శాసనసభ ఎన్నికలలో ఓడిపోయింది.

కానీ రేవంత్ రెడ్డి అధికారమనే ముళ్ళ కిరీటం ధరించి, ముళ్ళ సింహాసనం వంటి ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నా చాలా నిబ్బరంగా పార్టీని, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు.

ఆర్ధిక సమస్యలను భరిస్తూనే రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఇటు బీఆర్ఎస్‌ పార్టీ, అటు బీజేపి విసిరే సవాళ్ళను తట్టుకొని నిలబడుతున్నారు.

కనుక కాంగ్రెస్‌ అధిష్టానం అహం పక్కన పెట్టగలిగితే రేవంత్ రెడ్డిని చూసి కూడా చాలా నేర్చుకోవచ్చు. అందరితో అణకువగా ఉంటూ, కలుపుకు పోతూనే, ధైర్యంగా సవాళ్ళను ఎదుర్కొంటూ పార్టీని ఎలా నడిపించాలో, ఏవిదంగా విజయాలు సాధించాలో రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకోవచ్చు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

After 3 Years, NTR Makes a Surprise Call

A phone call after three years has suddenly got the industry curious. Writer Kona Venkat…

14 minutes ago

విజయసాయి పార్టీ ప్రమోషన్స్ బాగానే ఉన్నాయి.. ఎలా ఆడుతుందో?

సినిమా షూటింగ్‌ పూర్తయిన తర్వాత రిలీజ్‌ చేసే వరకు పాటలు, టీజర్‌, ట్రైలర్‌, ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లు, ఇంటర్వ్యూలు అంటూ వీలైనంతగా…

15 minutes ago