Telugu

రేవంత్ ప్రసంగాలు…కాస్త మర్యాదపూర్వకంగా ఉంటే మేలేమో..?

తెలంగాణ సీఎం హోదాలో ఉంటూ రేవంత్ రెడ్డి చేస్తున్న రాజకీయ ప్రసంగాలు కాస్త మర్యాదపూర్వకంగా ఉంటే మేలేమో అన్న భావన రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తుంది. తమ రాజకీయ ప్రత్యర్థిని ప్రజల ముందు ఎండగట్టడం, వారి పై విమర్శలు చెయడం, వారి ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి కార్యక్రమాలను, అక్రమాల చిట్టా పొద్దులను ప్రజల ముందు బయటపెట్టడం మంచి ఉద్దేశమే.

అయితే అందుకు రేవంత్ ఎంచుకుంటున్న భాష మాత్రం కాస్త అభ్యంతర కరంగా ఉంటుంది అని ప్రజాస్వామ్య వాదులు వారిస్తున్నారు. గతంలో తనకు కూడా తన ప్రత్యర్థులు అదే తీరుగా విమర్శించారు కాబట్టి ఇప్పుడు తానూ కూడా అదే తరహా ట్రీట్మెంట్ ఇస్తాను అని రేవంత్ తన ప్రసంగాల వాడి వేడిని సమర్దించున్నప్పటికీ ఆ భాషా ప్రయోగాలు నచ్చకే ప్రజలు వారిని ప్రతిపక్షానికి రేవంత్ ని అధికార పక్షానికి తెచ్చారు అనే చేదు నిజాన్ని రేవంత్ ఎన్నడూ విస్మరించకూడదు.

ADVERTISEMENT

గతంలో ఏపీలో వైసీపీ కూడా ఇదే తరహా రాజకీయం చేసి పాతాళానికి పడింది. చివరికి తాజాగా జరిగిన స్థానిక ఎన్నికలలో కూడా ప్రజలు వైసీపీ ని ఘోరంగా తిరస్కరించారు. తమ పార్టీ క్యాడర్ ని మెప్పించడానికో, తన అనుచరులలో జోష్ నింపడానికో రాజకీయ నాయకులు ఇటువంటి ప్రసంగాలు చేసినప్పటికీ అవి ఒక సామాన్య ఓటర్ ని పార్టీకి దూరం చేస్తాయి అనేది రాజకీయ నేతలు గ్రహించాలి.

ముఖ్యంగా బాధ్యతాయుత పదవులలో ఉన్నవారు, నలుగురికి ఆదర్శంగా ఉండేవారు ఈ విషయంలో మరింత జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అసలు విషయానికొస్తే, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఉద్దేశించి రేవంత్ చేసిన వ్యాక్యలు వ్యక్తిగత విమర్శల కోవలోకి చేరుకుంటున్నాయి.

కేటీఆర్ గడ్డం మీద రేవంత్ చేసిన వ్యాక్యలు…నువ్వు గడ్డం పెంచినంత మాత్రాన ఎప్పటికి రేవంత్ కాలేవు, పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే పులవుతుందా.? నీకు గడ్డం రావడానికి 50 ఏళ్ళు పట్టింది, కానీ బుద్ది ఎప్పటికి పెరుగుతుందో.? పది జన్మలెత్తినా నువ్వు ఎప్పటికి తారక రామారావే…అంటూ రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ ప్రసంగాలలో అసందర్భాలే అని చెప్పొచ్చు.

ఒక వ్యక్తి గడ్డం మీద కూడా రాజకీయ విమర్శలు చేయడం అంటే అది రాజకీయంగా దిగజారడమే అవుతుంది. గడ్డానికి – రాజకీయానికి ఎటువంటి సంబంధం ఉండదు. అటువంటప్పుడు రేవంత్ కేటీఆర్ గడ్డం టార్గెట్ గా విమర్శలు చెయ్యాల్సిన అవసరం ఏమొచ్చింది.?

అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఉద్దేశించి కూడా రేవంత్ చాల ఘాటు వ్యాఖ్యలు చేసారు. వికారాబాద్ జిల్లా హాకింపేట సభలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ ల పై రేవంత్ రెచ్చిపోయారు. ఎల్నినో, కాళేశ్వరం, ప్రాణహిత – చేవెళ్ల పై డిసెంబర్ లో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని స్పీకర్ ను కోరుతున్నానని,

కేసీఆర్, కేటీఆర్, హరీష్, వాళ్ళ తాతలు, ముత్తాతలు ఎవరొచ్చినా అనుమతివ్వాలన్నానని, వాళ్ళ తాట తీసి తోళ్ళు అసెంబ్లీ ముందు వేలాడతీస్తా అంటూ సీఎం హోదాలో ఉంటూ ఆవేశపూర్వక ప్రసంగాలు చేస్తున్నారు. ఒక బాధ్యతాయుత పదవిలో ఉన్నవారే ఇలా మాజీ సీఎం ని ఉద్దేశించి రెచ్చకొట్టే ప్రసంగాలు చేయడం ఎంతవరకు సమర్థనీయం అనేది ఆలోచించాలి.

ప్రతిపక్ష నేతలను అసెంబ్లీ కి రావాలని కోరుకోవడం, రాకపోతే విమర్శించడం తప్పు కాదు, అందుకోసం ప్రాణాలతో లేనివారిని కూడా తమ రాజకీయ విమర్శల పరిధిలోకి తేవడం ఎన్నటికీ ఆమోదయోగ్యం అనిపించుకోదు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Ranbir’s Shocking Retirement Plan After Ramayana?

Ranbir Kapoor is currently appearing as Lord Ram in Ramayana, and he has already got…

27 minutes ago

Nooru Kodi Vaanavil Review: Outdated, Amateurish Romance

BOTTOM LINE Outdated, Amateurish Romance PLATFORM ZEE5 RUNTIME 2Hours What Is the Show About? Vinoth,…

58 minutes ago