పాపం రేవంత్ రెడ్డి.. మరో అస్త్రం దొరుకుతుందా?

తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ‘కుల గణన’ని మోడీ ప్రభుత్వంపై దివ్యాస్త్రంలా సందిస్తే రాహుల్ గాంధీ ఆయన భుజం తట్టి ప్రోత్సహించారు. కానీ మోడీ ప్రభుత్వమే ఆ అస్త్రాన్ని హైజాక్ చేసి ఎత్తుకుపోయింది. ఇది కాంగ్రెస్‌ పార్టీకి ఊహించని పెద్ద షాకే!

కనుక సిఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు మరో దివ్యాస్త్రం బయటకు తీస్తున్నారు. అదే.. బీసీల రిజర్వేషన్స్ 37 నుంచి 42 శాతం పెంచాలని కేంద్రాన్ని కోరుతూ తెలంగాణ శాసనసభలో చేసిన ఏకగ్రీవంగా ఆమోదించిన బిల్లు.

ADVERTISEMENT

దానిని సుమారు నెల రోజుల క్రితం తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్ ప్రశాంత్ వర్మ ఆమోదానికి పంపగా, ఆయన రాష్ట్రపతి పరిశీలన, ఆమోదం కొరకు పంపించాలని పక్కన పెట్టారు.

కానీ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన బిల్లులు, చట్టాలు, ఆర్డినెన్సులు వగైరాలను గవర్నర్లు తమ వద్ద నెలరోజుల కంటే ఎక్కువ రోజులు ఉంచుకోకూడదని, ఒకవేళ ఉంచుకుంటే వాటికి ఆమోదం తెలిపినట్లే పరిగణించి అమలు చేయవచ్చని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది.

కనుక తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ తన వద్దకు వచ్చిన బీసీ రిజర్వేషన్స్ పెంపు బిల్లున్ని రాష్ట్రపతి పరిశీలన, ఆమోదం కొరకు పంపించారు.

కుల గణన అస్త్రం హైజాక్ అవడంతో కంగుతిన్న కాంగ్రెస్‌ నేతలు, దీనిని ఓ చిన్న అవకాశంగా గుర్తించి, హడావుడిగా రాజ్ భవన్‌ వెళ్ళి తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మని కలిశారు.

ఆ బిల్లుని రాష్ట్రపతి ఆమోదం కొరకు పంపించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపి అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “ కుల గణన చేపడతామని కేంద్ర ప్రభుత్వం చెప్పడమే కాంగ్రెస్ పార్టీ విజయంగా భావిస్తున్నాము. ఇప్పుడు ఈ బీసీ రిజర్వేషన్స్ పెంపు బిల్లుని రాష్ట్రపతి వద్దకు వెళ్ళడం మరో విజయంగానే భావిస్తున్నాము.

బీసీ రిజర్వేషన్స్ పెంపు కోసం మాతో కలిసి వచ్చే పార్టీలని కలుపుకొని కేంద్రంపై ఒత్తిడి చేసి దీనిని కూడా ఆమోదింపజేసుకుంటాము,” అని కాంగ్రెస్‌ నేతలు అన్నారు.

సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రకారం, రాష్ట్రపతి పరిశీలన, ఆమోదం కొరకు వచ్చిన బిల్లులు, చట్టాల, ఆర్డినెన్సులపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలి. లేకుంటే ఎవరైనా సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే వాటిపై కూడా నిర్ణయం తీసుకుంటామని తేల్చి చెప్పింది.

కనుక బీసీ రిజర్వేషన్స్ పెంపు బిల్లు రాజ్ భవన్‌ నుంచి రాష్ట్రపతికి వెళ్ళింది కనుక తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ప్రజలకు చెప్పుకునేందుకు కాస్త ఊరట లభించింది. కనుక ఇక నుంచి తెలంగాణ కశ నేతలందరూ బీసీ రిజర్వేషన్స్ పెంపు గురించి మాట్లాడటం మొదలుపెడతారేమో?

కానీ మోడీ ప్రభుత్వం కుల గణనని హైజాక్ చేసినట్లే బీసీ రిజర్వేషన్స్ పెంపు చట్టాన్ని కూడా హైజాక్ చేస్తే?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

So Many Rejections, Nani Must Be Cautious!

Nani's latest film The Paradise marked one of the most ambitious attempts of his career.…

28 minutes ago

Ranabaali Under Pressure: Is Vijay Betting Too Much on the Trailer?

Vijay Deverakonda appears unfazed by the slow start to Ranabaali’s North American advance bookings. The…

57 minutes ago