Telugu

రాజగోపాల్ అతి స్వేచ్ఛ కు అధిష్టానం స్పందన ఇదేనా.?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ గా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పదేపదే పరోక్ష విమర్శలు చేస్తున్నా కాంగ్రెస్ అధిష్టానం రాజగోపాల్ ను ఎందుకు కట్టడి చెయ్యలేకపోతుంది.?

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని పదేళ్ల తరువాత బిఆర్ఎస్ తో రాజకీయ యుద్ధం చేసి మరి ఒంటి చేత్తో అధికారంలోకి తెచ్చిన రేవంత్ కేంద్రంగా రాజగోపాల్ పదేపదే రెచ్చిపోతున్నా కనీసం రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ నాయకత్వం కూడా ఎందుకు స్పందించలేకపోతుంది.?

ADVERTISEMENT

పార్టీలో ఉన్న ఈ అంతర్గత విభేదాల పరిష్కారం కోసం పార్టీ అధిష్టానం ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది, చొరవ చూపించలేకపోతుంది. అనే ప్రశ్న కాంగ్రెస్ క్యాడర్ తో పాటుగా రేవంత్ అభిమానులను సైతం ఆవేదనకు గురి చేస్తుంది.

సొంత పార్టీ నేతే ఇలా సీఎం రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, ఆయనకు వ్యతిరేకంగా స్వరం వినిపిస్తున్నా కాంగ్రెస్ నుంచి కనీస స్పందన ఎందుకు కరువయ్యింది.? రాజగోపాల్ అతి స్వేచ్చకు కాంగ్రెస్ అధిష్టానం కళ్లెం వెయ్యలేదా.? అనేదానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నుంచి నేడు సమాధానం లభించింది.

రేవంత్ టార్గెట్ గా రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలను పార్టీ రాష్ట్ర స్థాయి అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ ఖండించారు. రాజగోపాల్ ఆవేదన, ఆందోళన ను తానూ అర్ధం చేసుకోగలనని, కానీ దాన్ని ఇలా బహిరంగంగా బయటపెట్టడం రాజగోపాల్ కి తగదని, రాజగోపాల్ తనకు మంచి మిత్రుడని, ఏమైనా సమస్యలుంటే పార్టీ అంతర్గత సమావేశాల ద్వారా చర్చినించుకోవాలే కానీ ఇలా పార్టీ గీత దాటి ముందుకెళ్లొద్దంటూ హితవు పలికారు.

అయితే ఒక మంత్రి పదవి కోసం రాజగోపాల్ ఇలా పదేపదే సీఎం రేవంత్ ను టార్గెట్ చేస్తూ పార్టీని రేవంత్ సర్కార్ ని రాజకీయంగా ఇలా ఇరుకున పెడుతుంటే పార్టీ పెద్దలు రాజగోపాల్ పై తీసుకునే చర్యలు ఇవేనా.? ఆయన చేస్తున్న ఇటువంటి పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలను మహేష్ గౌడ్ ప్రకటనలు కట్టడి చెయ్యగలవా.?

రేవంత్ కు కన్నులో నలుసు మాదిరి రాజగోపాల్ పదేపదే ఇబ్బంది పెడుతున్నా పార్టీ అధిష్టానం రాజగోపాల్ పై ఇప్పటికి మెతక వైఖరి అవలభించడం తో ఏదోరోజు ఈ ఏకే మేకై కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉందంటున్నారు రేవంత్ వర్గీయులు.

పార్టీలో సీనియర్లందరిని తనదారికి తెచ్చుకున్న రేవంత్ రాజగోపాల్ విషయంలో ఎందుకు ఫెయిల్ అయ్యారు. రేవంత్ కి రాజగోపాల్ లో మధ్య ఉన్న ఆ కోల్డ్ వార్ కు ముగింపేప్పుడు.? రేవంత్ ని వలస పక్షి అంటూ వాదించే రాజగోపాల్ 2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి బీజేపీ కి వలస వెళ్లిన సంగతి మరిచారా.?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Two Star Kids, One Painful Reality Check

In the film industry, a famous surname can make the first step much easier. It…

12 minutes ago

Why Is Every Star Fan Meet Becoming Political?

Not every fan meeting is a political rehearsal. But in Tamil Nadu today, it is…

43 minutes ago