
తెలంగాణ రాజకీయాలలో రేవంత్ vs కేసీఆర్ అన్నట్టుగా సాగే రాజకీయ విమర్శలు ఎప్పుడు చాల ఘాటుగానే వినిపిస్తాయి. కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ అంబాసిడర్ కారు పై సెటైర్లు వేశారు. కేసీఆర్ అంబాసిడర్ కి ఎప్పుడో కాలం చెల్లిందని,
అందుకనే ఆయన ను, ఆయన కారును తెలంగాణ సమాజం ఫామ్ హౌస్ కి పరిమితం చేసిందంటూ వ్యాఖ్యానించారు. 1956 సిలబస్ తో 2026 లో ఉద్యోగాలు రావని, ప్రస్తుతం అంబాసిడర్ కార్ ఎక్కడ రోడ్ల మీద కనిపించడం లేదని, ఇప్పుడు BMW, బెంజ్, టెస్లా మోడల్స్ కార్లు రోడ్ల మీదకు వచ్చేసాయంటూ బిఆర్ఎస్ గులాబీ కారు గాలి తీశారు రేవంత్.
అంబాసిడర్ కారు తాలూకా రిపేర్ లను నేటి తరం యువతకు నేర్పించడం వలన ఉపయోగం ఏముంటుందన్నారు. అయితే రేవంత్ కేసీఆర్ కారు పై చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు బిఆర్ఎస్ vs రేవంత్ గా మారనున్నాయి. మొదటి నుంచి కూడా రేవంత్, కేసీఆర్ పై దూకుడుగా రాజకీయ విమర్శలు చేస్తారు.
అలాగే కేసీఆర్ తో నువ్వా నేనా అన్నట్టుగా రాజకీయ పోరాటాలు, సవాళ్లు చేస్తారు. పార్టీ ఓటమి నుంచి కేవలం ఫామ్ హౌస్ కే పరిమిత అయిన కేసీఆర్ ని రాష్ట్ర అసెంబ్లీకి రావాలని, కేసీఆర్ అసెంబ్లీ కి వస్తే బిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి పైన, కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి పైన చర్చిద్దాం అంటూ కేసీఆర్ కి సవాల్ విసిరారు.
గత పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నడూ ప్రజా సమస్యలు పట్టించుకోని కేసీఆర్, ప్రజలకు సమయం కేటాయించని కేసీఆర్ తన పై తన ప్రభుత్వం పై విమర్శలు చేయడం శోచనీయం అంటూ కేసీఆర్ పై విరుచుకుపడ్డారు రేవంత్. అయితే ఈ స్థాయిలో కేసీఆర్ ని రెచ్చకొడుతున్నా, దమ్ముంటే అసెంబ్లీ కి రావాలని అంటూ సవాల్ చేస్తున్నా కేసీఆర్ మాత్రం తన మౌన దీక్షను విరమించడం లేదు, తన రాజకీయ అజ్ఞాతానికి ముగింపు పలకడం లేదు.
Venkatesh’s much-hyped Aadarsha Kutumbam AK 47, directed by Trivikram, has been indefinitely postponed. Producer Naga…
The Ministry of External Affairs in India has amended the passport rules for minors of…