
అవును ఈ మాట అన్నది తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డే. మంగళవారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఇదివరకు ఎవరైనా ఎమ్మెల్యే చనిపోతే వారి కుటుంబ సభ్యులకు ఆ సీటు ఇచ్చినప్పుడు, మిగిలిన పార్టీలు తమ అభ్యర్ధులను పోటీగా పెట్టకుండా వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు తోడ్పడేవి.
రాజకీయాలలో ఈ సత్సంప్రదాయం చాలాకాలంపాటు సాగింది. కానీ కేసీఆర్ ప్రవేశించిన తర్వాత దీనిని చెడగొట్టారు. నాడు పీ.జనార్ధన్ రెడ్డి చనిపోతే అయన సతీమణిని కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తుంటే, కేసీఆర్ ఆమెపై బీఆర్ఎస్ అభ్యర్ధిని పోటీ పెట్టారు.
అప్పటికీ ఆమె బీఆర్ఎస్ పార్టీ మద్దతు కోరేందుకు స్వయంగా కేసీఆర్ ఇంటికి వెళ్తే, మూడు గంటలు బయటే నిలబెట్టిన దుర్మార్గుడు కేసీఆర్. భర్తని కోల్పోయిన ఓ ఆడపడచు సాయం కోసం ఇంటికి వస్తే ఇలాగేనా వ్యవహరించేది?
కానీ నాడు చంద్రబాబు నాయుడు ఆమె తమ ప్రత్యర్ధి అయినప్పటికీ విజ్ఞతతో వ్యవహరిస్తూ పోటీ పెట్టలేదు. చంద్రబాబు నాయుడుకి ఉన్నంత విజ్ఞత కేసీఆర్‌కి లేదు. కేసీఆర్‌కే విజ్ఞత లేకపోతే ఆయన కొడుకు కేటీఆర్‌కి ఉంటుందా?” అంటూ సిఎం రేవంత్ రెడ్డి తండ్రీకొడుకులపై నిప్పులు చెరిగారు.
ఒకప్పుడు తెలంగాణ ఉద్యమలాలో అందరి సహాయసహకారాలు తీసుకున్న కేసీఆర్, ముఖ్యమంత్రి కాగానే నియంతగా మారి అందరినీ ఉక్కుపాదంతో అణచివేశారు. తనకు, తన పార్టీకి, ప్రభుత్వానికి ఎదురు ఉండకూడదని ప్రతిపక్షాలను నిర్వీర్యం చేశారు.
ఇటువంటి వైఖరి కలిగిన కేసీఆర్ ఇటువంటి సత్సంప్రదాయలను పట్టించుకుంటారని ఆశించడం అత్యాశే అవుతుంది. నాడు ఈ సంప్రదాయాన్ని గౌరవించి ఉండి ఉంటే నేడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో మాగంటి సునీతని గెలిపించుకోవడానికి ఇంత ఎదురీత అవసరంయ్యేదే కాదు కదా?
నేటికీ తెలంగాణ రాజకీయాలలో, ముఖ్యంగా ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ప్రస్తావన వస్తూనే ఉండటం విశేషం. సిఎం రేవంత్ రెడ్డితో సహా పలువురు ఈవిదంగా అయనని ప్రశంశిస్తుంటే, బీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం అయనని బూచిగా చూపించి రాజకీయ లబ్ది పొందాలని ఆరాటపడుతున్నారు.
ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా కేసీఆర్‌లాగే రాష్ట్రంలో రాజకీయాలను చాలా కలుషితం చేశారు. దాని పర్యవసానాలే ఇప్పుడు అనుభవిస్తున్నారు. అదే… అయన అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యానికి కట్టుబడి పాలన సాగిస్తూ, ప్రతిపక్షాలను గౌరవించి ఉండి ఉంటే నేడు ఇటువంటి అవమానకర పరిస్థితులు ఎదుర్కోవలసిన అవసరమే ఉండేది కాదు కదా?
పవన్ టార్గెట్ గా అటు ఏపీలో జరుగుతున్న 'కుల' రాజకీయాలు ఇటు తెలంగాణలో మొదలైన 'ప్రాంతీయ' రాజకీయాలు ఎన్నో సందేహాలకు…
Mega Power Star Ram Charan delivered a very composed and highly inspiring speech at his…