హాట్’ బ్యూటీ బయోపిక్ నుండి ‘క్లాస్’ పిక్స్!

Richa Chadda in Shakeela Biopicఒకప్పుడు తెలుగు, మలయాళ, తమిళ సినీ రంగాలను ఊపేసిన షకీలా, గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా తన జీవితాన్ని తెరపైకి తీసుకువస్తున్న క్రమంలో… ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఫోటోలను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

[m9ad]

ADVERTISEMENT

షకీలా పాత్రను హీరోయిన్ రిచా చద్దా పోషిస్తుండగా, ఈ ఫస్ట్ లుక్ ఫోటోలలో కేరళ సాంప్రదాయ దుస్తులలో అందంగా, ఆహ్లాదకరంగా కనిపించింది. నిజానికి షకీలా అంటే హాట్ లుక్ కు పర్యాయపదం. అలాంటి షకీలా కాస్ట్యూమ్స్ కు భిన్నంగా ఈ పిక్స్ ఉండడం విశేషం. బహుశా షకీలా తెరవెనుక కధ ఆవిష్కృతం కానుందేమో!

“మోనాలిసా, ఐశ్వర్య, లవ్ యూ అలియా” చిత్రాలకు దర్శకత్వం వహించిన కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఇంద్రజిత్ లంకేష్ ఈ బయోపిక్ ను తెరకెక్కిస్తున్నారు. మరోవైపు షకీలా “శీలవతీ” (వాట్ ది ..క్ అనే ఉపశీర్షిక) అనే సినిమాను తన 250వ సినిమాగా ప్రకటించి, ఇటీవల ఫస్ట్ టీజర్ ను కూడా విడుదల చేసారు.Richa Chadda in Shakeela Biopic- (2)

Richa Chadda in Shakeela Biopic- (2)

ADVERTISEMENT
Latest Stories