
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై చాలా నిర్భయంగా అభిప్రాయలు చెప్పగలిగే అతికొద్ది పత్రికలలో ఆంధ్రజ్యోతి (ఏబీఎన్) కూడా ఒకటి. ఏబీఎన్ న్యూస్ ఛానల్లో ప్రతీ ఆదివారం ప్రసారమయ్యే ‘వీకెండ్ కామెంట్ బై ఆర్‌కే’ అంటే రెండు తెలుగు రాష్ట్రాలలో అధికార, ప్రతిపక్ష నాయకులందరికీ భయమే అంటే అతిశయోక్తి కాదు.
ఏబీఎన్ న్యూస్ ఛానల్ టీడీపికి, కూటమి ప్రభుత్వానికి కాస్త అనుకూలంగా కనిపిస్తున్నప్పటికీ, లోపాలు, అవినీతి కనిపిస్తే నిర్దాక్షిణ్యంగా ఉతికి ఆరేస్తుంటుంది.
ఈరోజు (ఆదివారం) ‘వీకెండ్ కామెంట్ బై ఆర్‌కే’లో జగన్ లేదా కేసీఆర్‌లను ఉతికి ఆరేస్తారనుకుంటే, ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుని ఆరేశారు. అయన అమలుచేస్తున్న పీ4 పధకాన్ని, దానిలో లోటుపాట్లు ఎత్తిజూపుతూ, పర్యవసానాలను వివరిస్తూ ఉతికి ఆరేశారు.
వేమూరి రాధాకృష్ణ సందించిన ప్రశ్నలు:
· రాష్ట్రంలో పేదరికం కొంత శాతం తగ్గించవచ్చు కానీ పూర్తిగా నిర్మూలించడం సాధ్యమేనా?సాధ్యమే అయితే అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలలో నేటికీ పేదలు, పేదరికం ఎందుకుంది?
· పేదలను ఆదుకునేందుకు సమాజంలో ఉన్నత ఆదాయ వర్గాలు స్వచ్చందంగా ముందుకు రావాలని కోరితే తప్పు లేదు. కానీ తప్పనిసరిగా పేదలను దత్తత తీసుకోవాలని బలవంతం చేయడం సబబా?
· ఒక గ్రామంలో వెయ్యి కుటుంబాలు ఉన్నాయనుకుంటే వాటిలో 100 లేదా 200 కుటుంబాలను ఈ పీ4 కార్యక్రమం కింద ‘బంగారు కుటుంబాలు’గా ఎంపిక చేసి, వారికి పీ4 ద్వారా అన్ని విధాల ఆదుకుంటూనే యధావిధిగా సంక్షేమ పధకాలను కూడా అందిస్తుంటే, గ్రామంలో మిగిలిన కుటుంబాలు అసూయతో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెంచుకుంటే కూటమి ప్రభుత్వమే నష్టపోతుంది కదా?
· తెలంగాణలో దళిత బంధు పధకంతో బీఆర్ఎస్ పార్టీ ఈవిడంగానే నష్టపోయింది కదా?
· ఈ కార్యక్రమం అమలుకి జిల్లా కలెక్టర్లకు, వారు తమ కింద స్థాయి అధికారులకు టార్గెట్లు పెట్టడంతో వారి రోజువారి పనులపై దృష్టి పెట్టగలరా?
· ఓ పక్క కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (పరిశ్రమల సామాజిక బాధ్యత) పధకం కింద వాటి చేత ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మళ్ళీ పీ4 అవసరం ఏమిటి?
· ఈ కార్యక్రమంలో టీడీపి ఎమ్మెల్యేలు ఎందుకు తలదూరుస్తున్నారు? వారు ఎందుకు మార్గదర్శులకు బంగారు కుటుంబాలను సిఫార్సు చేస్తున్నారు?
· ఈ పీ4 మోజులో పడి కొట్టుకుపోతుంటే, ప్రజలు జగన్‌ని కాదని తమని ఎందుకు ఎన్నుకుని అధికారం కట్టబెట్టారో గుర్తుందా?
అంటూ వేమూరి రాధాకృష్ణ అనేక ప్రశ్నలు సందించారు. టీడీపి, సిఎం చంద్రబాబు నాయుడి వీరాభిమానులకు ఇవి చాలా ఆగ్రహం కలిగించవచ్చు.
కానీ వైసీపీకి, దాని అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులని సమర్ధిస్తూ వారి సొంత మీడియా తాళం వేస్తే చివరికి వైసీపీయే నష్టపోయింది కదా? అలా కాకుండా అవసరమైతే ఈవిదంగా ఎప్పటికప్పుడు తప్పొప్పులను ఎత్తిచూపుతూ ప్రభుత్వాన్ని, అధికార పార్టీ నేతలని దారి తప్పకుండా అప్రమత్తం చేస్తుండే ఇటువంటి మీడియా నిజమైన శ్రేయోభిలాషి. ఈ విషయం గ్రహిస్తే ఎవరూ ఈ ప్రశ్నలను, విమర్శలను తప్పు పట్టరు. మీడియా చూపుతున్న ఈ తప్పులను సరిదిద్దుకుని ముందుకు సాగుతూ ప్రజలకు మరింత చేరువవుతారు. మళ్ళీ మళ్ళీ విజయం సాధిస్తూనే ఉంటారు.
Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…
The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…