‘నారా లోకేష్’ కోసం ‘తారక్’ సినిమాలను తొక్కేస్తున్నారట!

YSRCP MLA roja headed to supreme courtమైక్ ముందుకు వస్తే చంద్రబాబును టార్గెట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న నగరి ఎమ్మెల్యే రోజా మరోసారి అదే పని చేసి తన మనోగతాన్ని బయటపెట్టారు. మళ్ళీ ఆనాటి వైశ్రాయ్ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబుపై విరుచుకుపడిన రోజా, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను తన రాజకీయ లబ్ది కోసం మరోసారి తెరపైకి తీసుకువచ్చారు. నారా లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను చంద్రబాబు తొక్కేస్తున్నారని, లోకేష్ ఒక పప్పు సుద్ధ అని తీవ్ర పదజాలంతో వ్యాఖ్యానించారు.

ఇదే తరహా వాదనలను ఈ ఏడాది సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలైన “నాన్నకు ప్రేమతో” సమయంలో కూడా రోజా చేసారు. అయితే, ఆ సినిమా విడుదల కావడం, 50 కోట్లను కొల్లగొట్టడం తెలిసిన విషయమే. ఒక రాజకీయ పార్టీనో, ఒక వ్యక్తో ఫలానా సినిమా చూడమనో, చూడవద్దనో చెప్తే వినే స్థితిలో ప్రజలు ఉన్నారనుకోవడం రోజా భ్రమే అనుకోవాలా? సినిమా బాగుంటే ఎవరు వద్దన్నా ప్రేక్షకులు ఆగరు, అలాగే సినిమా బాలేదంటే ఎవరు ఎన్ని చెప్పినా మొహమాటం లేకుండా తిప్పి కొడతారు. ఇన్నేళ్ళు సినీ ఇండస్ట్రీలో ఉన్న రోజాకు ఈ విషయం తెలియనిదేమి కాదు.

ADVERTISEMENT

అయితే రాజకీయ విమర్శల భాగంగా నందమూరి కుటుంబాల మధ్య విభేదాలను తనకు అనుకూలంగా మలచుకోవాలని రోజా చేస్తున్న ప్రయత్నంగానే సినీ, రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి. నేరుగా విమర్శలు చేయడానికి ఏ అంశం లేకపోవడంతో… కుటుంబాల మధ్య ఉన్న మనస్పర్ధలను స్వార్ధ రాజకీయ లబ్ధి కోసం వాడుకునే చవకబారు స్థితికి వైసీపీ నేతలు వచ్చారనడానికి రోజా వ్యాఖ్యలే నిదర్శనంగా విశ్లేషకులు చెప్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories