వైసీపి తుపాకులు గురి తప్పుతున్నాయా?

వైసీపి అధినేత జగన్మోహన్‌ రెడ్డి మొదలు ఆ పార్టీలో మంచి నోటి జోరున్న వారందరూ ఇంతకాలం చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లను లక్ష్యంగా చేసుకుని అవహేళన చేస్తుండేవారు. కానీ ఇప్పుడు వారందరూ తమ తుపాకులను జగన్మోహన్‌ రెడ్డి సొంత చెల్లెలు, ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై గురిపెడుతున్నారు.

ADVERTISEMENT

వారందరూ జగన్మోహన్‌ రెడ్డి అనుమతి, ఆదేశం లేనిదే ఇంత సాహసానికి పూనుకోరని వేరే చెప్పక్కరలేదు. కనుక చెల్లి వైఎస్ షర్మిలపై ఆయనే వారి చేత ఎదురుదాడి చేయిస్తున్నట్లు భావించవచ్చు. ఒకవేళ కాదంటే వారందరినీ ఆయన వారించి ఉండేవారు కదా?

ఇప్పుడు అన్నా చెల్లెళ్ళ మద్య జరుగుతున్న ఈ యుద్ధంలో వారందరూ ‘అర్జునుడు’ వైపు నిలబడి పోరాడుతుంటే, ఆమె ఒంటరిగా వారందరితో పోరాడుతున్నారు.

అంటే ఆమె అన్న జగన్‌ ఏవిదంగా తాను ప్రతిపక్షాలతో ఒంటరిగా పోరాడుతున్నారో అదేవిదంగా ఆమె కూడా జగనన్న సైన్యంతో ఒంటరిగా పోరాడుతున్నారన్న మాట!

తాను ఒంటరిపోరాటం చేస్తున్నానని, ప్రజలే తనను ఆదుకోవాలని వేడుకొంటున్న జగన్, మరి చెల్లెలి మీదకు తన సైన్యాన్ని పంపడాన్ని ఏవిదంగా సమర్ధించుకోగలరు?

గమ్మతైన విషయం ఏమిటంటే, వైసీపిలో అందరూ జగన్‌ను అన్నగా భావిస్తూ మాట్లాడుతుంటే, సొంత చెల్లి వైఎస్ షర్మిల మాత్రం జగన్‌ను అన్నగా భావించడం లేదిప్పుడు. కానీ వైవీ సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి సూచన మేరకు, ‘జగనన్న’ అని నోరారా పిలుస్తూ, అన్న అసమర్ధతని, అవినీతిని ప్రశ్నిస్తున్నారు. సొంత చెల్లెలిపైనే బురద జల్లిస్తున్నారని, కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారంటూ వైఎస్ షర్మిల ఎదురుదాడి చేస్తున్నారు.

జగన్మోహన్‌ రెడ్డి తన మంత్రులు, ఎమ్మెల్యేలు, సాక్షి మీడియా చేత సొంత చెల్లిపై ఇంత దారుణంగా అవహేళన చేయిస్తూ, మళ్ళీ బటన్ నొక్కుడు సభల్లో “నా ప్రియాతి ప్రియమైన అక్కాచెల్లెమ్మలు, అవ్వా తాతయ్యలు…” అంటూ నాటకీయంగా చెప్పే డైలాగులకు ప్రజలకు పడిపోతారా?లేక పడగొట్టేస్తారా?అని ఆలోచించిన్నట్లు లేదు.

వైసీపి నేతలు చేస్తున్న ఎదురుదాడితో ప్రజలకు షర్మిలపై సానుభూతి పెరుగుతుండగా, ఆమె సొంత అన్నపై చేస్తున్న విమర్శలు, తమ కుటుంబం గురించి చెపుతున్న కొత్తకొత్త విషయాలతో ఓ పక్క తన పాపులారిటీ పెంచుకుంటూనే, మరోపక్క జగన్మోహన్‌ రెడ్డి ప్రతిష్ట మసక బారిపోతోంది.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, గత నాలుగున్నరేళ్ళుగా తన వీరభజన చేస్తున్న మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలనే జగన్‌ పక్కన పెట్టేస్తున్నప్పుడు, రేపు ఎన్నికలలో ఓడిపోయి కాంగ్రెస్‌తో కలిసిపోదామనుకుంటే లేదా ఏపీలో హంగ్ అసెంబ్లీ ఏర్పడి చెల్లెలు షర్మిలతో రాజీ పడితే, ఆమెను తిడుతున్న రోజా వంటివారి పరిస్థితి ఏమిటి? అన్నాచెల్లెలు ఇద్దరూ కలిసి వారిని ఏరిపడేయకుండా ఉంటారా? ఆలోచించుకుంటే మంచిదేమో?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

AP’s ₹20,369 Crore Plan to Widen Highways to Four Lanes

Andhra Pradesh has proposed a ₹20,369 crore plan to widen busy two-lane national highways into…

15 minutes ago

Pics: Varsha Gives Rain Fashion A Bold Upgrade!

Varsha Rekhate turns a rainy backdrop into a style moment in this striking gallery. Dressed…

35 minutes ago