
ఏపీలో జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలతో పొత్తుపెట్టుకుని కూటమిగా ఏర్పడి ప్రభుత్వంలో భాగమయ్యింది. ఈ నేపథ్యంలో టీడీపీ సభలో జనసేన జెండాలు, జనసేన కార్యక్రమాల్లో టీడీపీ జెండాలు కనిపించేటమO సర్వ సాధారణం.
పొత్తులో ఉన్న పార్టీల జెండాలను మిత్ర పక్ష పార్టీల క్యాడర్ మోస్తుంది, మొయ్యాలి కూడా. అప్పుడే పొత్తుకు సరైన నిర్వచనం ఇచ్చినట్టవుతుంది. అయితే ఇలా జనసైనికులు టీడీపీ జెండాలు మోయడాన్ని తప్పుబడుతూ వారిని జెండా కూలీలు అంటూ కించపరుస్తూ నగరి మాజీ ఎమ్మెల్యే రోజా నోరు పారేసారు.
అలాగే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని ప్యాకేజ్ స్టార్ అంటూ నిందించారు. ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకున్న పార్టీల జెండాలను మోస్తే జెండా కూలీలు అంటూ హేళన చేస్తున్న వైసీపీ నేతలు ఇప్పడు బిఆర్ఎస్ సభలో వైసీపీ జెండాలను ఎందుకు ప్రదర్శించినట్టు.? జై కేటీఆర్ అంటూ వైసీపీ క్యాడర్ ఎందుకు నినదించినట్టు.? అంటే రోజా దృష్టిలో వైసీపీ క్యాడర్ కూడా జెండా కూలీలేనా.?
ఏపీలో అధికారం కోసం కొట్లాడుతూ, ఇక్కడి ప్రజలను ఓట్లడుగుతున్న వైసీపీ నాయకులకు తెలంగాణ నేతలతో, అక్కడి రాజకీయ పార్టీలతో సంబంధం ఏమిటి.? జగన్ పుట్టిన రోజున తాడేపల్లి ప్యాలస్ దగ్గర బిఆర్ఎస్ జెండాలు పెట్టడం, కేసీఆర్, కేటీఆర్, జగన్ ఫ్లెక్సీలు ముద్రించడం వెనకున్న రాజకీయ మర్మమం ఏమిటో.? రోజా చెప్పగలరా.?
ఏపీ నీటి ప్రోజెక్టులకు వ్యతిరేకంగా బిఆర్ఎస్ పోరాడుతున్నా, ఇందు కోసం కోర్టులకెళ్లినా, వైసీపీ ఏపీ హక్కుల కోసం ఎందుకు గళం విప్పలేకపోతుంది.? బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఎందుకు నోరు మెదపలేకపోతుంది.? బిఆర్ఎస్ ప్రకటనలకు ఎందుకు వంత పాడుతుంది.? అంటే జగన్ కేసీఆర్ దగ్గర ప్యాకేజ్ తీసుకున్నట్టా.?
NTR fans are growing anxious about Trivikram’s ambitious mythological project, tentatively titled God of War,…
Team India started the T20I series against West Indies with a complete performance in Lucknow.…