
వైసీపీ నగరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా పై ప్రస్తుత టీడీపీ నగరి ఎమ్మెల్యే గాలి భాను కీలక వ్యాఖ్యలు చేసారు. గత వైసీపీ ప్రభుత్వంలో పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న రోజా నిత్యం తిరుమల పర్యటనలతో వ్యాపారం చేసిందని, ఇప్పటికి తిరుమలలో తన దందా కొనసాగిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.
రోజా తిరుమల పర్యటన కు వచ్చిన ప్రతిసారి తనతో పాటుగా పదుల సంఖ్యలో వ్యక్తులను తిరుమల శ్రీవారి దర్శనానికి తీసుకొచ్చేవారు. అలాగే ఆమె తిరుమల దర్శనానికి వచ్చిన ప్రతిసారి కూడా పవిత్రమైన తిరుమల కొండ పై రాజకీయాలు మాట్లాడేవారు.
తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లకూడదు అనే భావనతో తిరుమల కొండ మీద రాజకీయ ప్రకటనలకు నిషేధం ఉన్నప్పటికీ రోజా ఒక ఎమ్మెల్యే గా మంత్రిగా ఉంటూ కూడా కొండ పైన గోవిందుడి సాక్షిగా రాజకీయాలు మాట్లాడేవారు. అలాగే తన పర్యటనతో అనేకమందిని వెంటేసుకుని శ్రీవారి దర్శనానికి వచ్చేచారు.
అయితే ఈ పర్యటనల పై అప్పట్లోనే పెద్ద ఎత్తున రోజా పై విమర్శలు వెల్లువెత్తాయి. VIP దర్శనాల పేరుతో రోజా ఆధ్యాత్మిక ప్రాంతాన్ని ఒక వ్యాపార కేంద్రంగా మార్చారంటూ నాటి తిరుపతి జనసేన నాయకుడు కిరణ్ రాయల్ రోజా పై పదేపదే ఆరోపణలు చేసేవారు.
ఇక ఇప్పుడు ఆ ఆరోపణలు టీడీపీ నగరి ఎమ్మెల్యే గాలి భాను చేస్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ మాజీ ఎమ్మెల్యేగా రోజా ఇప్పటికి తిరుమల దర్శనాలను వ్యాపారం గా మార్చుకుని దండుకుంటున్నారని మండిపడ్డారు.
అధికార పార్టీలో ఉన్న తాము కూడా అన్ని సార్లు తిరుమల సందర్శనకు వెళ్లమని, కానీ రోజా మాత్రం ఇలా తిరుమల దర్శనాల పేరుతో వ్యాపారం చేస్తూ ముఖ్యమంత్రి బాబు పై టీడీపీ చైర్మన్ బిఆర్ నాయుడు పై నోటికొచ్చినట్టు మాట్లాడడం సబబు కాదని, తన ఈ నోటి దురుసుతో జగన్ ను గాడు అని అందరితో తిట్టించాలని రోజా ఆశపడుతున్నారంటూ భాను మీడియా ముందు రోజా పై రెచ్చిపోయారు.
Venkatesh Maha is returning with his next film Attahaasam. The film is set in the…
Earlier there were multiple unverified media reports about the ACB court potentially looking at impounding…