Telugu

స్టాలిన్ ఓటమి…రోజా పై ట్రోలింగ్…

డీఎంకే పార్టీకి ఈ ఎన్నికలు షాక్ మీద షాక్ ఇస్తున్నాయనే చెప్పాలి. ఎట్టి పరిస్థితులలోనూ తమిళనాడులో మాదే అధికారం అని ధీమాగా ఉన్న డీఎంకే శ్రేణులకు విజయ్ TVK ‘విజిల్’ వేసి మరి స్టాలిన్ పార్టీని ఓడించింది..

డీఎంకే 71 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతూ రెండవ స్థానానికి పరిమితం అయ్యింది. ఈ ఓటమే ఒక రకంగా డీఎంకే పార్టీకి ఉహించని షాక్ అనుకుంటే ఇప్పుడు ఏకంగా పార్టీ అధినేత స్టాలిన్ ఓటమి ఆ పార్టీని కోలుకోలేని విధంగా దెబ్బకొట్టింది.

ADVERTISEMENT

కొళత్తూర్ నుంచి ఎన్నికల బరిలో నిలిచిన స్టాలిన్ ఎవ్వరు ఊహించని విధంగా TVK అభ్యర్థి V.S బాబు చేతిలో ఓటమి పాలయ్యారు. మొదటి రౌండ్ కౌంటింగ్ నుంచి కూడా బాబు స్టాలిన్ పై ఆధిక్యం కొనసాగిస్తూనే వచ్చారు. చివరికి స్టాలిన్ ని ఓడించి డీఎంకే పార్టీకి కోలుకొని దెబ్బ కొట్టారు.

దీనితో తమిళనాడు వ్యాప్తంగా TVK అభ్యర్థి V.S బాబు హాట్ టాపిక్ అయ్యారు. ఇదిలా ఉంటే తమిళనాడు ఎన్నికలలో డీఎంకే ఓటమికి, స్టాలిన్ పరాభవానికి కారణం వైసీపీ నేత రోజా అంటూ సోషల్ మీడియాలో రోజా పై ట్రోలింగ్ నడుస్తుంది.

తమిళనాడు ఎన్నికలలో రోజా డీఎంకే పార్టీకి మద్దతుగా నాటి సీఎం స్టాలిన్ కి అనుకూలంగా ప్రచారం చేసారు. స్టాలిన్ పాలన విధానాలు చాల బాగున్నాయంటూ, ఆయన మహిళా పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని, అవే ఆయనను, ఆయన పార్టీని తిరిగి అధికారంలోకి తెస్తాయంటూ ప్రగల్భాలు పలికారు.

దీనితో ఇప్పుడు రోజా వీడియోలు పోస్టు చేస్తూ రోజా ప్రచారం కారణంగానే డీఎంకే ఓటమి ని చవిచూసిందని, చివరికి ఆమె ప్రభావంతోనే స్టాలిన్ కూడా ఓటమి పాలయ్యారంటూ రోజా ని రోస్ట్ చేస్తున్నారు. అందుకు ఉదాహరణగా కొన్ని ఘటనలను, సంఘటనలను కూడా తెరమీదకు తెస్తున్నారు.

గతంలో రోజా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలిసిన తరువాత జరిగిన పరిణామాలు, వైసీపీ లో చేరిన తరువాత వైఎస్ జగన్ ఎదుర్కున్న పరిస్థితులను విశదీకరిస్తూ ఇప్పుడు ఆ ఖాతాలో స్టాలిన్ కూడా బలి అంటూ స్టాలిన్ ఓటమి ని డీఎంకే అపజయాన్ని రోజా ఖాతాలో వేస్తున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Lokesh Kanagaraj’s Next as Hero: Bold Choice or Big Risk?

Following the commercial success of Psycho in 2020, director Mysskin completed the shooting for his…

17 minutes ago

Drishyam 3 vs Haiwaan: No Fake Claims, Pure Box Office

Drishyam: The Conclusion has been a big box-office success. Trade experts can't predict exactly where…

38 minutes ago