
ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలు, ప్రతీకార రాజకీయాలు, బూతు రాజకీయాలు, రంగుల రాజకీయాలు, ప్రజలకు డబ్బులు పంచుతూ ఓటు బ్యాంకు రాజకీయాలు, వాలంటీర్ల రాజకీయాలు వంటి కొత్త రకం రాజకీయాలను జగన్ ప్రవేశపెట్టారు. పదవీ, అధికారం కోల్పోయిన తర్వాత కూడా జగన్‌తో సహా వైసీపీ నేతలు వాటినే కొనసాగిస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఇటీవల టీడీపి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఆమెను ఉద్దేశ్యించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. రోజా నోటి దురుసు గురించి అందరికీ తెలిసిందే. కానీ అంత మాత్రాన్న ఆమెపై అటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఎవరూ హర్షించలేరు. కనుక రోజా ఊరుకుంటారనుకోవడం అవివేకం.
నగరి వైసీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, “గాల్లో గెలిచినా గాలి కొడుకులు ఎక్కువైపోయారు. ఇప్పుడు హైదరాబాద్‌కు పారిపోతున్నా జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఇంతకు వందరెట్లు ప్రతీకారం తీర్చుకుంటాము” అని అన్నారు.
ఏపీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. “ఆయన ఏ రాష్ట్రానికి వెళ్తే అక్కడే పుట్టానంటూ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఆయనకు పిచ్చి బాగా ముదిరిపోయింది,” అని రోజా ఆక్షేపించారు.
ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ తన గురించి అనుచితంగా మాట్లాడితే రోజా హుందాగా స్పందించి ఉండి ఉంటే ప్రజల సానుభూతి ఆమెకు లభించి ఉండేది. కానీ ఈవిదంగా ‘గాలి కొడుకులు’ అంటూ అసభ్యంగా మాట్లాడటం వలన ఆమెని తప్పు పట్టే పరిస్థితి కల్పించుకున్నారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే రాజకీయాలలో బూతులు ప్రవేశపెట్టారు. ఇప్పుడు కూడా వాటిని కొనసాగిస్తుండటం విశేషం. రాజకీయాలు ఈ స్థాయికి దిగజారిన తర్వాత ఇప్పుడు నేతల నోట ఇటువంటి మాటలే వినిపిస్తుంటాయి. కనుక వాటికి బాధపడటం దేనికని ఈవిదంగా ఎదురుదాడి చేస్తుంటే, రాజకీయాలలో అసభ్యత ఇంకా ఇంకా పెరుగుతుందే తప్ప తరగదు కదా?
ఏది ఏమైనప్పటికీ, మళ్ళీ మేము తప్పకుండా అధికారంలోకి వస్తామనే వైసీపీ నేతల గట్టి నమ్మకం, వస్తే తమ రాజకీయాలు ఏవిదంగా ఉండబోతున్నాయో చెపుతుండటం రెండూ చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.
Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…
The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…