అవ‌హేళ‌న అవ‌స‌రమా.. బ‌న్నీపై రౌడీ స్టార్ ఫ్యాన్స్ ఫైర్‌

Rowdy fans fires on Allu Arjunఓ వ్య‌క్తిని మ‌నం గౌర‌వించక‌పోయినా ప‌రావాలేదు. కానీ విమ‌ర్శిస్తూ మాట్లాడ‌కూడ‌దు. క్రిటిసిజం అనేది ఉండాలి. కానీ ఏదీ కూడా హ‌ద్దులు దాట కూడ‌దు. రీసెంట్‌గా విడుల‌దైన పాన్ ఇండియా మూవీ లైగ‌ర్ విష‌యంలో రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, పూరి జ‌గ‌న్నాథ్ అండ్ టీమ్ చాలా విమ‌ర్శ‌ల‌నే ఎదుర్కొన్నారు. కొంద‌రు డైరెక్ట్‌గా కామెంట్ చేస్తే.. మ‌రికొంద‌రు ఇన్‌డైరెక్ట్‌గా కామెంట్ చేశారు. రీసెంట్ టైమ్‌లో శ్రీవిష్ణు హీరోగా న‌టించిన చిత్రం అల్లూరి. ఈ శుక్ర‌వారం థియేట‌ర్స్‌లో సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్‌గా జ‌రిగింది. అందులో శ్రీ విష్ణు చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి. ‘అందరూ ప్లాన్ చేసి పాన్ ఇండియా తిరిగితే షేక్ అవుద్ది.. ఆయ‌న (అల్లు అర్జున్‌) ఇక్క‌డ ప్లాన్ చేస్తే ఇండియా షేక్ అవుతుంది’ అని శ్రీవిష్ణు తన స్పీచ్‌లో అన్నాడు.

శ్రీవిష్ణు మాట్లాడిన మాట‌ల‌పై ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్, నెటిజ‌న్స్‌ ఫైర్ అవుతున్నారు. అయితే వారు శ్రీవిష్ణుని కాకుండా అల్లు అర్జున్‌ని క్వ‌శ్చ‌న్ చేస్తున్నారు. ‘‘‘అందరూ..ప్లాన్ చేసి పాన్ ఇండియా తిరిగితే..Shake అవుద్ది”. ఆయన (అల్లు అర్జున్) ఇక్కడ చేస్తే పాన్ ఇండియా షేక్అవుద్ది’ అనటం ద్వారా సభ్య సమాజానికి ఏం సందేశం ఇద్దామని అనుకుంటున్నావు? . నువ్వు(అల్లు అర్జున్) విజయ్ దేవరకొండ కంటే గొప్ప అని చెపుదామని అంటున్నావా? – కాదని ఎవరన్నారు?

ADVERTISEMENT

సాటి హీరో విజయ్ దేవరకొండ ప్రమోషన్స్ కోసం దేశం మొత్తం తిరిగిన కష్టాన్ని గుర్తించకపోయినా పర్వాలేదు. అవహేళన అవసరమా?. నీ మీద ఉన్న సదభిప్రాయం ఈరోజుతో పోయింది. అల్లు అర్జున్ కూడా మీ మాటలకూ మురిసిపోయాడనుకోండి. దాని అర్థం అతనికే తెలియాలి’’ అంటూ విజ‌య్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ రియాక్ష‌న్‌పై కామెంట్స్ రూపంలో రియాక్ట్ అవుతున్నారు.

శ్రీవిష్ణు అలా విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఇన్‌డైరెక్ట్‌గా టార్గెట్ చేసి మాట్లాడిన‌ప్పుడు అల్లు అర్జున్ ముసి ముసిగా న‌వ్వుకున్నాడు. కానీ.. దానిపై రియాక్ట్ కాక‌పోవ‌టం అనేది చాలా మందికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది. కొంద‌రు నెటిజ‌న్స్ బ‌న్నీ ప్ర‌వ‌ర్తించిన తీరునే త‌ప్పుప‌డుతున్నారు. అంటే పాన్ ఇండియా సినిమాను ప్ర‌మోట్ చేసుకోవ‌టం త‌ప్పేలా అవుతుంది. లైగ‌ర్ స‌మ‌యంలో విజ‌య్ దేవ‌ర‌కొండ మాట్లాడే స‌మ‌యంలో కంట్రోల్ త‌ప్పి ఉండొచ్చు. అంత మాత్రాన సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన వ్య‌క్తిగా మీరు కూడా ఇలా రియాక్ట్ అయితే ఎలా అని క్వ‌శ్చ‌న్ చేస్తున్నారు. మ‌రిప్పుడు ఇటు శ్రీవిష్ణు కానీ.. అటు అల్లు అర్జున్ అండ్ టీమ్ కానీ.. ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Exclusive Video Interviews: Watch & Subscribe

ADVERTISEMENT
Latest Stories