
కట్ చేస్తే… నేడు “ఆర్ఆర్ఆర్” రిలీజ్ రోజు. అదే అన్నపూర్ణ ధియేటర్ మరోసారి వార్తల్లోకెక్కింది. ఆగ్రహంతో కట్టలు తెంచుకున్న అభిమానులు ధియేటర్ లో విధ్వంసానికి పూనుకున్నారు. ధియేటర్ లోని అద్దాలు పగలకొట్టి సీట్లను ధ్వంసం చేసారు.
దీనికి కారణం మేకులు కొట్టించడం అయితే కాదు. ‘ఆర్ఆర్ఆర్’ షో మొదలైన గంట తర్వాత ఒక్కసారిగా సినిమా ఆగిపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సినిమా ఆగిపోయి, మళ్ళీ ప్రదర్శనకు ఆలస్యం కావడంతో ఫ్యాన్స్ ఆగ్రహావేశాన్ని అన్నపూర్ణ ధియేటర్ యాజమాన్యాన్ని చవిచూడాల్సి వచ్చింది.
ఏదో జరుగుతుందని ముందుగానే స్క్రీన్ ముందు మేకులు కొట్టించి పలు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, ఫలితం లేకుండా పోయింది. సాంకేతిక కారణాల వలన ఎదురైన ఇబ్బందితో ధియేటర్ మొత్తం ధ్వంసం అయిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ధియేటర్ కు చేరుకుని, పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
SS Rajamouli has conquered box-office records with larger-than-life storytelling. But there is one thing that…
Following the terrible failure of Toxic, Yash has still not announced his next solo lead…