ఆర్ఆర్ఆర్ – ఒక ఫుల్ కామెడీ సినిమా!

RRR Event Rajamouli about his assistant directorsమార్చి 25వ తేదీన విడుదల కాబోతున్న “ఆర్ఆర్ఆర్” సినిమా దేశభక్తి నేపధ్యంలో తెరకెక్కింది కాదు, ఇద్దరు స్నేహితుల నడుమ జరిగిన కధగా దర్శకుడు జక్కన్న ఇప్పటికే స్పష్టం చేసారు. అయితే ఎన్టీఆర్ – రామ్ చరణ్ లు నటించిన “ఆర్ఆర్ఆర్” కాకుండా, మరో “ఆర్ఆర్ఆర్” కూడా ఉందంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి బయటపెట్టారు.

సమయం అయిపోతుందని ఎప్పుడూ తన అసిస్టెంట్ దర్శకుల గురించి చెప్పలేదని, కానీ ‘శాంతి నివాసం’ సీరియల్ నుండి తనతో ప్రయాణిస్తున్నారని తెలిపారు జక్కన్న. దాదాపుగా 10 మంది అసిస్టెంట్ దర్శకుల జాబితా చెప్పిన రాజమౌళి, ఇన్నాళ్లు తనను భరించినందుకు వీరందరికి కృతజ్ఞతలు తెలిపారు.

ADVERTISEMENT

25వ తేదీన మీరు చూడబోయే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను మా అసిస్టెంట్ దర్శకులందరూ ముందే చేసేసారని, హీరోలుగా, హీరోయిన్లుగా, ఇతర పాత్రల్లో వారే నటించారని, నేను చెప్తున్నాను ఈ ‘ఆర్ఆర్ఆర్’ మాత్రం ఒక పూర్తి హాస్యాస్పదమైన సినిమా అని, ఈ సినిమాను కూడా ఖచ్చితంగా రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారు రాజమౌళి.

బహుశా జక్కన్న తీసిన ఫుల్ లెంగ్త్ కామెడీ మూవీగా ఈ ‘ఆర్ఆర్ఆర్’ ఉండబోతుందేమో చూడాలి. అయితే ధియేటర్లలో కాదులేండి, యూట్యూబ్ లో ‘బ్లూపర్స్’ రూపంలో కామెడీగా రిలీజ్ చేస్తారేమో! ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ కావడంతో ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర యూనిట్ అంతా కూడా ఫుల్ జోష్ లో ఉంది.

ADVERTISEMENT
Latest Stories