ఆర్ఆర్ఆర్ ని పాటతో మొదలు పెడతాదట!

RRR Movie starts with songబాలీవుడ్ బ్యూటీ అలియా భట్ రామ్ చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ లో కనిపించనుంది. ఈ నటి ఇప్పటికే షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది, కానీ ఆమె రాక వేరువేరు కారణాలతో రెండుసార్లు వాయిదా పడింది. తాజా విషయం ఏమిటంటే ఆమె మే నెలాఖరులో ఆర్ఆర్ఆర్ షూట్ మొదలు పెడుతుంది.

ADVERTISEMENT

ఏప్రిల్ 14 నాటికి లాక్‌డౌన్ సడలించబడుతుందనే అంచనాతో చిత్రబృందం తన షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటుంది. ఈ అమ్మడు వెంటనే సినిమా సాంగ్ షూట్‌లో చేరనుంది . ఆ తరువాత కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించబడతాయి. 2021 జనవరి 8 న సంక్రాంతి స్పెషల్‌గా విడుదలకు ఆర్‌ఆర్‌ఆర్ సిద్ధమవుతోంది.

మూవీ షూటింగ్ ఇప్పటివరకు 80% పూర్తయింది మరియు మొత్తం షూట్ జూన్ లేదా జూలై నాటికి పూర్తి అవుతుంది. ఆ తరువాత నిర్మాణానంతర కార్యక్రమాలు, ప్రమోషన్స్ కు పూర్తి సమయం కేటాయిస్తుంది చిత్రబృందం. ఆర్‌ఆర్‌ఆర్ నుంచి రామ్ చరణ్ ఇటీవల విడుదల చేసిన క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియోకు అద్భుతమైన స్పందన వచ్చింది.

సినిమా యొక్క హైప్ మరియు అంచనాలు అకస్మాత్తుగా రెట్టింపు అయ్యాయి. ఎన్టీఆర్ పుట్టినరోజు స్పెషల్‌గా మే 20 న కొమరం భీమ్ వీడియో విడుదల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్ వీడియోతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. వాటిని జక్కన్న అందుకుంటాడా అనేది చూడాలి.

ADVERTISEMENT
Latest Stories