ఆర్ఆర్ఆర్… రాసిపెట్టుకోండి 3000 కోట్లు..!

RRR will collect more than 3000 crsరిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ “ఆర్ఆర్ఆర్” సినిమాపై అభిమానుల అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. వీటిని మరింత పెంచే విధంగా తాజాగా సోషల్ మీడియాలో ఓ అంశం వచ్చి చేరింది. “ఆర్ఆర్ఆర్”ను ప్రేక్షకులు చూడడానికి ఈ నెల 25వ తేదీ వరకు వేచిచూడాలి గానీ, ఈ సినిమా కోసం పని చేసిన వారు మాత్రం “ఆర్ఆర్ఆర్”ను ఇప్పటికే తిలకించి ఉంటారన్న విషయం తెలిసిందే.

ఆ క్రమంలోనే “ఆర్ఆర్ఆర్” సినిమాకు కలరిస్ట్ గా పనిచేసిన శివ ఈ సినిమా కలెక్షన్స్ పై ఓ ఆసక్తికరమైన అంశాన్ని వెల్లడించారు. మలయాళం వెర్షన్ కు సంబంధించిన “ఆర్ఆర్ఆర్” సినిమాను ఇప్పుడే చూసానని, నేను వర్క్ చేసేటప్పుడు ఓ కలరిస్ట్ గా ప్రతి ఫ్రేమ్ ను కొన్ని వేల సార్లు చూసానని, కానీ ఓ ప్రేక్షకుడుగా బ్యాక్ గ్రౌండ్ తో కూడిన ఫైనల్ కాపీని చూసానని తెలిపారు.

ADVERTISEMENT

నేను బలంగా చెప్తున్నాను, ఈ సినిమా అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుంది, 3000 కోట్లు పైనే కలెక్ట్ చేస్తుందని, రాసిపెట్టుకోండని చెప్తూ తన ఇంస్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చాలా ఏమోషనల్ గా “ఆర్ఆర్ఆర్” సినిమాను ఫీల్ అయ్యానని శివ చెప్పగా, ఇదే విషయాన్ని జక్కన్న కూడా తన ఇంటర్వ్యూలలో ఇటీవల చెప్పుకొచ్చారు.

తాను ఇప్పటివరకు దర్శకత్వం వహించిన సినిమాలలో “ఆర్ఆర్ఆర్” సినిమా అత్యంత ఏమోషనల్ కధగా చెప్పుకొచ్చారు. సిల్వర్ స్క్రీన్ పై ఏమోషన్ ను అద్భుతంగా పండించగల దర్శకదిగ్గజం స్వయంగా వ్యక్తపరిచిన విశ్వాసానికి, నేడు కలరిస్ట్ శివ చెప్పిన దానికి సరిపోవడంతో, “ఆర్ఆర్ఆర్” కంటెంట్ పై అంచనాలు మరింతగా పెరుగుతూ పోతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories