గత రెండు వారాలుగా బాక్సాఫీస్ వద్ద తిరుగులేని హవాను కొనసాగించడంలో “ఆర్ఎక్స్ 100” పూర్తిగా విజయవంతం అయ్యింది. ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టరే స్పెషాలిటీ. ఆ క్యారెక్టర్ ను ధైర్యంగా పోషించిన పాయల్ రాజ్ పుత్ కు ప్ర్సతుతం టాలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపు లభించింది.
ఆ గుర్తింపులో ఈ వీడియో సాంగ్ కూడా ఒక భాగమే. ‘ఎవరే ఎవరే మనసు పట్టి’ అన్న ఈ వీడియో సాంగ్ రాజమహేంద్రవరం బ్రిడ్జ్ మరియు కోనసీమ అందాలలో చిత్రీకరించగా, ఈ పాటలో హీరోయిన్ సిగరెట్ తాగే సీన్ హైలైట్ అయ్యింది. ఇటీవల కాలంలో మహిళల స్మోకింగ్ సీన్స్ కామన్ అయినప్పటికీ, ఈ సినిమాలో హీరోయిన్ ది విలేజ్ వాతావరణం కావడంతో, వీక్షకులకు అది మరింత కిక్ ఇచ్చింది.
ADVERTISEMENT
[m9adh]
ADVERTISEMENT



