
బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసే రైతుబంధు పథకాన్ని ఈ నెల 28 లోపు అమలు చేసుకోవచ్చు, అయితే ఎన్నికల ప్రచారంలో ఎక్కడా బిఆర్ఎస్ నాయకులు రైతుబంధు పథకం గురించి ప్రకటనలు చెయ్యకూడదు అనే షరతుతో ఈసీ అనుమతి ఇచ్చింది.తాజా పరిణామాలతో ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగిందంటూ వచ్చిన ఫిర్యాదులతో ఎన్నిక సంఘం ఇచ్చిన అనుమతులకు ఉపసంహరించుకుంది.
తాజా ఈసీ నిర్ణయం పై స్పందిస్తూ టి. కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మంత్రి హరీష్ రావు ఎన్నిక ప్రచారంలో భాగంగా రైతు బంధు పంపిణి గురించిన చేసిన వ్యాక్యలతోనే ఈసీ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు.ఎన్నికల ముందు రైతు బంధు పథకమం తో ఓట్లు దండుకోవాలనే దురాశ, అహంకారం తప్పా ఈ మామ అల్లుళ్లకు మరో ఉద్దేశం లేదంటూ., రైతులెవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వచ్చే 15 రోజులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం రైతులకు 15 వేలు రైతుభరోసా ఇవ్వడం ఖాయం అన్నారు.
అలాగే బిఆర్ఎస్ నేతలు కూడా కాంగ్రెస్ పార్టీ కుట్రల వలనే ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఎదురుదాడి మొదలుపెట్టారు. టిపిసీసీ ఎన్నిక కమిటీ చైర్మన్ నిరంజన్ ఫిర్యాదు మేరకే ఈసీ రైతుబంధు పథకానికి తాత్కాలికంగా బ్రేకులు వేసిందని., రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ నేతల దురాలోచన ఏవిధంగా ఉంటుందో ఈ సంఘటనతో రుజువయ్యింది నేరం మొతం కాంగ్రెస్ కోర్టులోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు హరీష్ రావు.
అదే విధంగా ఈసీ నిర్ణయం మీద స్పందించిన కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత రైతుబంధు అనేది నిరంతర ప్రక్రియ, ఇదేమి ఎన్నికల మానిఫెస్టిలో కొత్తగా పెట్టిన పథకం కాదని, మీకు రైతుబంధు కావాలో రైతులను రాబందులుగా పీక్కుతినే కాంగ్రెస్ కావాలో ఆలోచించుకోవాలని తెలంగాణ ఓటర్లను కోరుతున్నారు. ఇలా కాంగ్రెస్ – బిఆర్ఎస్ పార్టీల మధ్య ఈసీ రైతుబంధు పతకంతో పెద్ద చిచ్చే రాజేసింది.
అయితే అసలు ఎన్నిక కమిషన్ ఇచ్చిన షరతులకు లోబడి ప్రచారంలో ప్రసంగాలు చేయాల్సిన అధికార పార్టీ నేతలు అది చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదుల వలనే ఇదంతా జరిగింది అంటూ వ్యాఖ్యానించడం కచ్చితంగా బాధ్యతా రాహిత్యమే అవుతుంది. ప్రచారంలో ప్రత్యర్థులకు తాళాలిచ్చి తలుపులు తియ్యొదంటే ఊరుకుంటారా? వారికి ఆ తాళాలు ఇవ్వాలా వద్దా అనేది మన చేతులలో ఉంటుంది. ఒక్కసారి వారి చేతికి తాళం అందిస్తే ఇక దానిపై స్పందించడానికి మిగిలేదిమి ఉండదు అనేది బిఆర్ఎస్ నేతలు గుర్తించాలి.
A Reddit post has gone viral for claiming that the cybersecurity firm Fortinet has laid…
An Indian F-1 student finds herself in serious trouble. A misunderstanding at Walmart has left…