
శ్రద్ధా కపూర్ తన మొదటి తెలుగు సినిమాలో మంచి పాత్రే పట్టినట్టుగా ఉంది. టీజర్ లో కూడా ఆమెకు ప్రాముఖ్యత ఇచ్చారు. టీజర్ లో వాడిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమా స్థాయికి తగ్గట్టుగానే ఉంది. టీజర్ చివర్లో దుండగుల నుంచి ప్రభాస్, శ్రద్ధ తప్పించుకుని ఓ చోట దాక్కుంటారు. అప్పుడు శ్రద్ధ ‘ఎవరు వీళ్లు’ అని ప్రభాస్‌ను అడుగుతారు. ఇందుకు ప్రభాస్.. ‘ఫ్యాన్స్’ అని సమాధానమిస్తారు. ఆ తర్వాత శ్రద్ధ.. ‘ఇంత వైలెంట్‌గా ఉన్నారు..’ అని అడగ్గా.. ‘డై హార్డ్ ఫ్యాన్స్’ అని ప్రభాస్ చెప్పిన డైలాగ్ హైలైట్‌గా నిలిచింది.
ఈ డైలాగ్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించింది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో ‘సాహో’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆగస్ట్ 15న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ చిత్రం చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతుంది. తొందర్లోనే ఆస్ట్రియా వెళ్ళి ఒక పాట అక్కడ చిత్రీకరిస్తారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషలలో ఒకేసారి రిలీజ్ కావడంతో సినిమా ప్రమోషన్లు కూడా అదే స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు.
Prabhas’ Fauzi teaser received a mixed response on social media, with criticism over its visual…
Vijay Sethupathi's Baththa directed by Balaji Tharaneetharan and produced by Atlee, was released in theatres…