
గత వైసీపీ ప్రభుత్వ విధ్వంసాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనా అన్నంతగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మారిపోయాయి. ఐదేళ్లలో రాష్ట్రాన్ని ఈ రకంగా దోచుకోవచ్చా, ప్రభుత్వంలోని వ్యవస్థలన్నిటినీ ఈ రకంగా భ్రష్టు పట్టించవచ్చా, ఇన్ని అక్రమాలకు తెగబడొచ్చా అన్నట్టుగా వైసీపీ పాలన, ఆ పార్టీ నేతల దోపిడీ జరిగింది.
అయితే గత ఐదేళ్లు అధికారికంగా రాష్ట్రానికి వైస్ జగన్ మోహన్ రెడ్డే సీఎం అయినప్పటికీ అనధికారికంగా రాష్ట్ర పాలన, ప్రభుత్వ పని తీరు మొత్తం ప్రభుత్వ సలహాదారుగా నియమించబడ్డ సాక్షి ఉద్యోగి సజ్జల రామకృష్ణ రెడ్డి దే అనేది జగమెరిగిన సత్యమే. దీనితో ఈయన గారి టాలెంట్ కు సజ్జలకు రాష్ట్ర వ్యాప్తంగా సకల శాఖ మంత్రిగా మంచి ప్రచారం దక్కింది.
ప్రభుత్వ సలహాదారుగా సజ్జల రామకృష్ణ రెడ్డి, వైసీపీ పార్టీ సోషల్ మీడియా అధినేతగా ఆయన పుత్ర రత్నం సజ్జల భార్గవ్ రెడ్డి చేసిన అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. వైఎస్ఆర్ జిల్లాలోని సీకే దిన్నె గ్రామా పరిధిలోని సుమారు 52 ఎకరాల అటవీ భూమి సజ్జల కుటుంబ కబ్జాలో చిక్కుకున్న విషయాన్నీ విచారణ కమిటీ అధికారికంగా నిర్దారించింది.
దీనికి తోడు పాయవంక రిజర్వాయర్ కోసం ప్రభుత్వం సేకరించిన మరో 8 ఎకరాల భూమి, మరికొంత ఎసైన్డ్ భూమి కూడా అక్రమంగా ఆక్రమించుకున్నట్టు విచారణ కమిటీ తేల్చింది. అటవీ భూమి కబ్జా చేస్తూ అందులో అనధికారికంగా గెస్ట్ హౌస్ లని నిర్మించడం, అక్రమంగా భూములను సాగు చేయడాన్ని అధికారులు గుర్తించారు.
అలాగే ఈ అక్రమ కబ్జా కు తోడు ఈ భూముల నిర్మాణాలకు కూడా ప్రభుత్వం నుండి వివిధ రకాలుగా రాయితీలు పొందినట్లు తేలింది. దీనితో సజ్జల కుటుంబ కోరలలో చిక్కుకున్న మొత్తం 62.72 ఎకరాల భూమిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలంటూ కమిటీ ప్రభుత్వానికి సూచనలు చేసింది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో అవినీతికి కాదేది అనర్హం అన్నట్టుగా ఇప్పటికే ఏపీలో వైసీపీ లిక్కర్ స్కాం, జిత్వాని కేసు, తిరుమల కల్తీ లడ్డు వ్యవహారం, ఇసుక, మైనింగ్ ఇలా అనేకానేక అంశాల మీద ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. లిక్కర్ స్కాం కేసులో ముమ్మరంగా విచారణ జరుగుతుంది.
ఈ కేసులో అరెస్టైన నిందితులంతా కూడా ఈ కుంభకోణం వెనుక దాగున్న పెద్ద తలకాయల పేర్లు ప్రకటించినట్టు మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ప్రభుత్వం విచారణ కు ఆదేశించిన ఏ కేసులో అయినా కామన్ గా వినిపిస్తున్న పేరు సజ్జల. ఈ నేపథ్యంలో ఇప్పుడు సజ్జల మెయిన్ లీడ్ గా నమోదైన 62 ఎకరాల భూ దోపిడీ కేసును సజ్జల ఎలా డిఫెండ్ చేసుకుంటారో చూడాలి.
Nani's latest film The Paradise marked one of the most ambitious attempts of his career.…
Vijay Deverakonda appears unfazed by the slow start to Ranabaali’s North American advance bookings. The…