ఇంతకీ సజ్జల విమర్శించినది రామోజీనా… జగన్మోహన్‌ రెడ్డినా?

అక్రమస్తుల కేసులనే మాట విన్నప్పుడు ఎవరికైనా టక్కున్న ఆ కేసులలో ఏ-1, ఏ-2 నిందితులుగా ఉన్న వైసీపి అధినేత జగన్మోహన్‌ రెడ్డి, విజయసాయి రెడ్డిలే గుర్తొస్తారు.

ADVERTISEMENT

కనుక ‘అక్రమాస్తుల కేసు’ అనే పదంపై వైసీపి అప్రకటిత నిషేధం ఉంది. కనుక వైసీపిలో ఎవరూ ఆ పదం పలకకుండా జాగ్రత్తగా మాట్లాడుతుంటారు. ఆ పదమే నిషిద్దమైనప్పుడు ఇక ఆ అక్రమాస్తుల కేసుల గురించి మాట్లాడే ధైర్యం వైసీపిలో ఎవరికుంటుంది?

కానీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావుని విమర్శించే ఉత్సాహంలో అక్రమాస్తుల కేసులు అంటూ చాలా మాట్లాడేశారు.

ఆయన రామోజీరావు కేసు గురించే మాట్లాడినప్పటికీ అదంతా జగన్‌ అక్రమాస్తుల కేసుల గురించి, తర్వాత జరుగబోయే పరిణామాల గురించి మాట్లాడిన్నట్లే ఉండటం విశేషం .

ఇంతకీ సజ్జల ఏమన్నారంటే,…

· అక్రమస్తుల కేసులో రామోజీరావు ఆర్ధిక నేరస్థుడు.

· ప్రజలను మోసం చేసి సంపాదించిన అవినీతి సంపాదనతో అవినీతి సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారు.

· సొంత మీడియాని ఉపయోగించుకొంటూ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు.

· తన సొంత మీడియా మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తల పేరుతో అబద్దాలను బ్యానర్‌ కధనలుగా వేస్తూ దుష్ప్రచారం చేస్తూ మాపై బురద జల్లుతున్నారు.

· చంద్రబాబు నాయుడుని మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోపెట్టాలని రామోజీరావు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

· అందరికీ నీతులు చెప్పే రామోజీరావు తాను మాత్రం పాటించకపోగా చాలా దిగజారిపోయారు.

· సొంత మీడియాలో తన మార్గదర్శి, అక్రమాస్తుల కేసుల గురించి ఎన్నడూ చిన్న వార్త కూడా వేయరు. కానీ మా పార్టీ, మా ప్రభుత్వంలో తప్పులను భూతద్దంలో పెట్టి మరీ చూపించే ప్రయత్నం చేస్తుంటారు.

· ఏదో రోజున రామోజీరావు అవినీతి, అక్రమాలన్నీ కోర్టులోనే రుజువు అవుతాయి. అప్పుడు ఆయన జైలుకి వెళ్ళక తప్పదు.

సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పిన ఈ మాటలలో రామోజీరావు అనే పేరు లేకుండా చదివితే ఆయన బహుశః తమ అధినేత జగన్మోహన్‌ రెడ్డి, తమ సాక్షి మీడియా గురించే చెప్పారనే భావన కలుగకుండా ఉంటుందా?శల్య సారధ్యం అంటే ఇదే కదా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

CJP Leaders Released as Delhi Tightens Security Ahead of Protest

Three Cockroach Janata Party (CJP) leaders detained ahead of a protest demanding the resignation of…

14 minutes ago

RT’s Thulabharam Title Documentary: A Creative Approach

Ravi Teja joins filmmaker Vivek Athreya, who is known for his distinct storytelling style, for…

44 minutes ago