
సకల శాఖ మంత్రిగా, వైసీపీ ప్రభుత్వ సలహాదారుగా గత ఐదేళ్లు రాష్ట్రంలో, వైసీపీ ప్రభుత్వంలో చక్రం తిప్పిన సజ్జల నేడు మిథున్ రెడ్డి అరెస్టు తో పార్టీని డిఫెండ్ చేయలేకపోతున్నారు.
అలాగే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్ అరెస్టు కు వైసీపీ క్యాడర్ ను మానసికంగా సిద్ధం చేసే పనిలో భాగంగా మీడియా బాట పట్టిన సజ్జల కూటమి ప్రభుత్వ కక్ష్య సాధింపులో భాగంగా జగన్ అరెస్టు కాబోతున్నారు అంటూ ఒక విచిత్ర వాదనను తెరమీదకు తెచ్చారు.
జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ లో అరెస్టు కావచ్చు అంటూ రాజకీయ వర్గాలలో గట్టి ప్రచారమే నడుస్తున్న సందర్భములో సజ్జల తెరమీదకు తెచ్చిన ఈ వింతైన వాదన ఇప్పుడు వైసీపీ డొల్లతన్నాని మరోసారి బయటపెట్టింది.
ప్రభుత్వం ఏర్పడిన మొదటిదశలో ఒకరి అరెస్టు చేయడం చాల సులభం, ఎందుకంటే ఆ సమయంలో వారిదగ్గర పూర్తి స్థాయిలో అధికారం ఉన్నత స్థితిలో ఉంటుంది. ఎవరు ఏమి అడిగే సాహసం చెయ్యరు, బాబు ప్రతీకారం కోసమే ఆ మార్గాన్ని ఎంచుకున్నారు,
కానీ వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ ప్రతి అంశంలోనూ సరైన మార్గంలోనే ముందుకెళ్లారు, బాబు అరెస్టు విషయంలో కూడా జగన్ అదే ఆచరించారు, అన్ని ఆధారాలు సేకరించిన తరువాతనే బాబు అరెస్టు జరిగింది అంటూ సజ్జల వైసీపీ ని డిఫెన్స్ చేస్తున్న విధానం పూర్తిగా తెలివితక్కువగా ఉంది.
సాక్ష్యాలను సేకరించడానికి 3 – 4 ఏళ్ళు పడుతుంది, కాబట్టి కేసు బలంగా ఉంటుంది అంటూ సజ్జల చెపుతున్న వాదన సహేతుకమైనది కాదు.
అలా అనుకున్న జగన్ ప్రభుత్వం తన చివరి అంకంలో బాబుని అరెస్టు చేసింది, అయినప్పటికీ అటు న్యాయస్థానానికి అరెస్టు విషయంలో సరైన ఆధారాలు చూపలేకపోయింది, అలాగే తమ చర్యలతో ఇటు ప్రజల దృష్టిలో బాబుని దోషిగా ఒప్పించలేకపోయింది.
ఇక, ప్రభుత్వం అరెస్టు నిర్ణయాన్ని ప్రభుత్వం ఏర్పడిన తొలిదశలోనే తీసుకుంటే అందుకు సంబంధించిన కేసుల నిరూపణలో ప్రభుత్వం ఖచ్చితమైన ఆధారాలు కోర్టుల తో పాటుగా ప్రజలకు వివరించాలి. లేని పక్షంలో అది ప్రభుత్వ కక్ష్య సాధింపు చర్యలలో భాగమయ్యే ప్రమాదం ఉంటుంది.
బాబు అరెస్టులో వైసీపీ కి సరైన ఆధారాలు చూపించే సమయం లేదని తప్పించుకునే అవకాశం ఉంటుంది, కానీ సజ్జల చేస్తున్న వాదన ప్రకారం ప్రభుత్వం మొదటి అంకంలో పార్టీ ముఖ్య నేతలను అరెస్టు చేస్తే ప్రభుత్వానికి అలా తప్పించుకునే అవకాశం ఉండదు.
అటువంటి చర్యలు ఎట్టి పరిస్థితులలోను న్యాయస్థానాలలో నిలబడలేవు, ప్రజల ఆమోదం పొందలేవు. కాబట్టి సజ్జల చేస్తున్న వాదనలో పూర్తిగా డొల్లతనం కనిపిస్తుంది.
Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…
The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…