వైసీపీ మంత్రులకి సజ్జల మళ్ళీ కొత్త లైన్ ఇచ్చారా?

చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేష్‌లను తిట్టిపోసేందుకే వైసీపీ ప్రభుత్వంలో ప్రత్యేకంగా కొందరు మంత్రులున్నారు. అయితే వారికి ఎప్పటికప్పుడు బహుశః వారి అధినేత లేదా వైసీపీకి శల్యసారధ్యం చేస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఏదో ఓ లైన్ ఇస్తుంటారు. ఆ లైన్ పట్టుకొని మంత్రులందరూ మూకుమ్మడి దాడి చేస్తుంటారు.

వేర్వేరు జిల్లాల నుంచి ఆ మంత్రులు ఒకే విదంగా మాట్లాడే మాటలు వింటే ఇది అర్దమవుతుంది. మళ్ళీ వారికి కొత్త లైన్ ఇచ్చిన్నట్లున్నారు. వెంటనే ఆ ప్రకారం చంద్రబాబు నాయుడుపై విమర్శలు, ఆరోపణలు మొదలుపెట్టేశారు.

ADVERTISEMENT

ఇంతకీ ఆ లైన్ ఏమిటంటే, ఢిల్లీలో ఓ వెబ్‌సైట్‌లో చంద్రబాబు నాయుడు రూ.118 కోట్లు పన్ను ఎగవేశారని, అందుకు ఆదాయపన్ను శాఖ నోటీసులు పంపిందట!

ఈ లైన్ పట్టుకొని మంత్రులు గుడివాడ అమర్నాథ్ విశాఖ నుంచి, చిత్తూరు నుంచి రోజా, గుడివాడ నుంచి ఎమ్మెల్యే కొడాలి నాని నోటికి వచ్చిన్నట్లు చంద్రబాబు నాయుడుని విమర్శిస్తున్నారు. దూషిస్తున్నారు.

చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ ఇద్దరిని అరెస్ట్‌ చేయాలని రోజా అంటే, చంద్రబాబు నాయుడు పోలిటికల్ క్రిమినల్ అంటూ ఏదేదో మాట్లాడారు. మాజీ బూతుల మంత్రిగా పేర్కొంది గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని నోరు విప్పితే ఎలా ఉంటుందో తెలిసిందే. చంద్రబాబు నాయుడు దొంగ, 420, అవినీతిపరుడు అంటూ చాలా అనుచితంగా మాట్లాడారు. వీరికి ఏమాత్రం తీసిపోని మంత్రి అంబటి రాంబాబు ఇంకా మాట్లాడలేదు. బహుశః నేడో రేపో ఆయన కూడా మీడియా ముందుకు వచ్చి ఇదే లైన్‌లో మాట్లాడటం ఖాయమే.

ఒకవేళ చంద్రబాబు నాయుడుకి ఐ‌టి శాఖ నోటీసులు పంపించి ఉంటే వాటికి ఆయన తప్పక జవాబు ఇస్తారు. తప్పదు. ఐ‌టి నోటీసులలో పన్ను చెల్లింపుల విషయమై సవాలు చేసేందుకు ఓ ట్రిబ్యూనల్, దానికీ ఓ పద్దతి ఉంటుంది. ఈ విషయం దేశముదురు వైసీపీ నేతలకు తెలియదనుకోలేము. కానీ చంద్రబాబు నాయుడు ఏదో పెద్ద ఆర్ధిక నేరం చేసిన్నట్లు అభివర్ణిస్తూ, ఆయనపై బురద జల్లాలని ప్రయత్నిస్తున్నారు. సామాన్య ప్రజలకు ఇన్‌కమ్ టాక్సు చెల్లింపుల గురించి పెద్దగా అవగాహన ఉండదు కనుక వారి మాటలు నిజమే అని భావించే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడుపై మంత్రుల మూకుమ్మడి దాడుల వెనుక వ్యూహం ఇదే.

ఇక చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందించడం లేదనే ప్రశ్నకు, వైసీపీ నేతలు ఏదో ఓ ఆరోపణ చేస్తుంటే వాటికి వివరణ ఇచ్చుకొంటూపోతే వారు ఇదేవిదంగా ఆరోపణలు చేస్తూ ప్రజల దృష్టిలో ఆయన దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తారు. అయితే ఈ ఆరోపణలకు చంద్రబాబు నాయుడు తప్పకుండా జవాబు ఇస్తారు. అది ఖచ్చితంగా ఈ వైసీపీ నేతల నోళ్ళు మూతపడేలాగే ఉంటుంది.

అసలు వైసీపీ సమస్య ఏమిటంటే, అభద్రతాభావమే. టిడిపి, జనసేనలు పొత్తులు పెట్టుకొంటే ఓడిపోతామని, బిజెపి కూడా కలుస్తుందేమోనని, చంద్రబాబు నాయుడు పిర్యాదుపై ఈసీ స్పందించి ఏపీలో ఓటర్ల జాబితాలను తవ్విపోస్తుందేమో అని, వివేకా హత్య కేసు, అక్రమాస్తుల కేసులు, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులలో ఏదైనా జరుగుతుందేమోననే భయం, ఆందోళనలే వారి చేత ఈ విదంగా మాట్లాడిస్తున్నాయని భావించవచ్చు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

శరన్నవరాత్రులు, విజయవాడ ఉత్సవ్.. ఈ ఉపశమనం అవసరమే!

రాజకీయాలు హుందాగా సాగుతున్నప్పుడే రాష్ట్రాలలో, దేశంలో రాజకీయ వాతావరణం కూడా బాగుంటుంది. కానీ ఇప్పుడు రాజకీయాలలో అటువంటి హుందాతనం తగ్గిపోయింది.…

4 minutes ago

Pawan Kalyan Wants Fair Share for JanaSena in Local Polls

JanaSena chief and Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan has asked TDP and BJP…

28 minutes ago