
ఈ విషయంగా ఇరువర్గాల వారు స్పందించింది ఇంత వరకే. అయితే సాక్షి ఈ ఇష్యూ ని రాజకీయంగా నాగబాబు, పవన్ కళ్యాణ్ ని దెబ్బ కొట్టడానికి వాడుకుంటుంది. నిహారిక క్యారెక్టర్ ని డామేజ్ చేస్తూ ఒక ఊహాజనితమైన కథనం ప్రచురించింది.
“‘నేను ఉద్యోగరిత్యా గౌరవమైన హోదాలో ఉన్నాను.. ఇంట్లో పెద్ద వాళ్లతో నిహారిక ఒక్క రోజు కూడా గౌరవంగా మసులుకోలేదు.. అసలు భర్తతో కలిసి జీవించాలనే ఆలోచన తనకు లేదు.. తన భర్త పై ఎప్పుడూ ప్రేమ చూపించలేదు. ఎప్పుడు చూసిన క్లబ్బులు, పబ్బులు అంటూ తిరగడమే తప్ప కుటుంబం గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఇప్పుడు మెగా అభిమానులు నా కుమారుడి గురించి చెడుగా ప్రచారం చేయడాన్ని చూసి సహించలేకపోతున్నాను’ అని జొన్నలగడ్డ ప్రభాకర్ రావు చెప్పారట అని రాసింది.
ఇది సాక్షి కల్లెక్ట్ చేసిన వార్త కాదు.. జొన్నలగడ్డ ప్రభాకర్ రావు చెప్పారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుందని వార్త వడ్డించింది. ఈ వార్తలో ఉన్న కొన్ని లూప్ హోల్స్ చూద్దాం.
నేను ఉద్యోగరిత్యా గౌరవమైన హోదాలో ఉన్నాను అని జొన్నలగడ్డ ప్రభాకర్ రావు చెప్పారని సాక్షి రాసింది. అయితే ఆయన 2020 లోనే రిటైర్ అయ్యారు. ఆ విషయం సాక్షి ఎడిటోరియల్ టీమ్ కి తెలీదా? ఒకవేళ ఆయన నిజంగా ఆ మాటలు అంటే రిటైర్ అయినట్టు ఆయనకు తెలియకుండా ఉండదు కదా?
సాక్షి ఒక పెద్ద మీడియా సంస్థ… జొన్నలగడ్డ ప్రభాకర్ రావు ఫోన్ నెంబర్ సాక్షి లో పని చేసే చాలా మంది రిపోర్టర్ల దగ్గర ఉంటుంది. లేకపోయినా దానిని సంపాదించడం అంత కష్టమేమీ కాదు.
మరి ఒక మీడియా సంస్థ గా సోషల్ మీడియా లో ఇలా అంటున్నారు అని వార్తలు వడ్డించే బదులు ఆయన అన్నారో లేదో కనుక్కుని రాయొచ్చు కదా? రాయదు ఎందుకంటే ఆ యాంగిల్ తమకు రాజకీయంగా ఉపయోగపడదు కదా?
అసలు ఆయన చెబుతున్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది అనేది కూడా అబద్దమే. ఆ మేరకు సోషల్ మీడియాలో ఎక్కడా కనిపించడం లేదు. కేవలం రాజకీయంగా నాగబాబు, పవన్ కళ్యాణ్, జనసేన పార్టీలను దెబ్బ కొట్టడం కోసమే నిహారిక వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుంది సాక్షి.
Kiran Abbavaram, who has acted in several successful films, is making his directorial debut with…
Nagarjuna has decided to present the film Itllu Arjuna under his Annapurna Studios banner after…