డబ్బులిచ్చి పవన్ కళ్యాణ్ ని తిట్టిస్తున్న సాక్షి?

Pawan Kalyan - Sakshi TVవైఎస్సార్ కాంగ్రెస్ కు పవన్ కళ్యాణ్ కు మధ్య ఉన్న విరోధం తెలిసిందే. పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి విమర్శలు చేసినప్పుడల్లా మంత్రులతో, ఆ పార్టీ నాయకులతో నానా తిట్లు తిట్టిస్తారు వైఎస్సార్ కాంగ్రెస్ వారు. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల దగ్గర నుండి ప్యాకేజీ అంటూ నానా మాటలు అంటారు ఆ పార్టీ నాయకులు.

దానిని పదే పదే టెలికాస్ట్ చేసి ఆనందపడుతుంది సాక్షి. అది చాలదు అన్నట్టు పెయిడ్ కాలర్స్ తో కూడా పవన్ కళ్యాణ్ ని తిట్టిస్తున్నట్టు ఉంది అధికార పార్టీ ఛానల్. ఇది ఏకంగా లైవ్ లో దొరికిపోయింది. సాక్షి టీవీ ఛానల్ లో ఒక హెల్త్ గైడ్ కార్యక్రమానికి ఒక డాక్టర్ ని తీసుకొచ్చి ప్రేక్షకుల సందేహాలను నివృత్తి చేయిస్తున్నారు.

ADVERTISEMENT

బహుశా ఆ కార్యక్రమానికి, పవన్ కళ్యాణ్ ని తిట్టే కార్యక్రమానికి ఒకే కాలర్ ని ఏర్పాటు చేసినట్టు ఉన్నారు. సదరు డాక్టర్ కు కాల్ చేసి పవన్ కళ్యాణ్ అలాగా పవన్ కళ్యాణ్ ఇలాగా అంటూ తిట్టేస్తున్నాడు సదరు కాలర్. అతను ఏ కార్యక్రమానికి కాల్ చేశాడు అనేది గుర్తు చేసి కాల్ కట్ చెయ్యాల్సి వచ్చింది ఆ యాంకర్.

అయితే ఆలోగానే అసలు విషయం లీక్ అయిపోయింది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీడియా విలువలకు పూర్తిగా తిలోదకాలు వదిలి పూర్తిగా అధికార పార్టీ కరపత్రంగా మారిపోయిన సాక్షి అంటూ జనసైనికులు సాక్షి పై మండిపడుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories