Telugu

సాక్షి కూడా 11 కి చేరువకానుందా.?

2024 ఎన్నికల ఫలితాల తరువాత 11 అనే అంకె ఏపీలో మోస్ట్ ట్రేండింగ్ నెంబర్ గా మారిపోయింది. ఇప్పుడు ఈ నెంబర్ ఎక్కడ కనిపించినా, వినిపించినా అది వైసీపీ ని ర్యాగింగ్ చేసినట్టుగానే భావిస్తున్నారు ఆ పార్టీ శ్రేణులు.

151 నుంచి 11 పడిన వైసీపీ పార్టీ దీనస్థితి నానాటికి మరింతగా దిగజారిపోతోంది అనే దానికి నిలువెత్తు నిదర్శనం గా నిలిచింది వైసీపీ ప్రతిరూపమైన సాక్షి పతనం.

ADVERTISEMENT

BARC 28 వ వారం శనివారం, 12 జులై నుండి శుక్రవారం, 17 జులై 2025 వరకు న్యూస్ ఛానెల్స్ రేటింగ్ విడుదల చేసింది. ఇందులో ఎప్పటి మాదిరిగానే రెండు తెలుగు రాష్ట్రాలలో టీవీ 9 నెంబర్ 1 గా నిలవగా ఎన్టీవీ రెండవ స్థానంలో కొనసాగుతుంది.

ఇక ఆ తరువాత స్థానాలలో టీవీ 5, ABN వరుసగా మూడు నాల్గు స్థానాలను దక్కించుకోగా, 10 టీవీ ఐదవ స్థానంతోను, V6 ఆరవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక జగన్ ఆత్మ సాక్షి, వైసీపీ ప్రాణవాయువుగా చెప్పుకునే సాక్షి ఎనిమిదవ స్థానానికి పడిపోయింది.

సాక్షి, బిగ్ టీవీ కంటే కింద స్థానానికి పడిపోవడం వైసీపీ ని ఆందోళన పెట్టె అంశంగా చెప్పవచ్చు. బిగ్ టీవీ (12.2)సాక్షి (12) గా ఉండగా టీడీపీ అనుకూల మీడియాగా చెప్పబడే ABN 26.1 వద్ద ఉంది. అంటే ABN కంటే సాక్షి ఎంత కింద స్థాయికి చేరిందో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది.

అలాగే హైద్రాబాద్ లో టీవీ 9, V6 మొదటి రెండు స్థానాలలో నిలవగా ఏబీఎన్ మూడో స్థానంలో ఎన్టీవీ నాల్గవ స్థానాలలో పోటీపడుతున్నాయి. హైద్రాబాద్ లో ఏబీఎన్ ఎన్టీవీ స్థానాన్ని కూడా వెనక్కి నెట్టడం ఇక్కడ గమనార్హం.

అయితే సాక్షి ఛానెల్ యొక్క ప్రజాదరణను వైసీపీ రాజకీయ ప్రజాదరణగా చూసినట్లయింటే ఆ ఛానెల్ యొక్క వీక్షకుల సంఖ్య బాగా తగ్గినట్టు కనిపిస్తుంది. దీనితో సాక్షి కూడా కొంచెం కొంచెంగా పతనమై తన ఆవిర్భావానికి మూలమైన వైసీపీ మాదిరి త్వరలో 11 ను చేరుకుంటుందా.?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Fauzi New Release Date: But Why Don’t Fans Believe It?

Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…

4 hours ago

Desi Man Arrested at US Airport: H-1B Revoked

The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…

4 hours ago